ఆలయ నిర్వహణకు నిధులు విడుదల: మంత్రి ఎస్.సవిత
Minister Savitha: త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర బిసి, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ మేరకు ఆమె కార్యాలయం నుంచి ఒక ప్రకటన జారీ చేసారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీపరంగా కురబలకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐక్యతతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యతోనే పేదరికం నిర్మూలన సాధ్యమ వుతుందని, కురబలు తమ బిడ్డలకు ఉన్నత విద్యలు అభ్యసించేలా ప్రోత్స హించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, అధికార పార్టీగా కురబల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

Honorarium for Temple Priests
Minister Savitha: కురబల అభ్యున్నతికి విద్యే ఏకైక మార్గం
భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడమే కాకుండా, శాశ్వత జీవో కూడా ఇచ్చామన్నారు. త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే విషయమై ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కురబలకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురబలు జిల్లాలు, మండలాల వారీగా తక్షణమే కుల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ నియామకానికి ఆసక్తి కలిగిన వారు అందజేయాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

