Kowdipally CHC Opening: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం (సిహెచ్ సి) నీ త్వరలో ప్రారంభించి, నిరుపేద రోగులకు వైద్య సేవలు అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ లు రాష్ట్ర సెక్రటరీ భవనంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ని మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
Free medical services for the poor in Kaudipalli soon.
Kowdipally CHC Opening: గత ప్రభుత్వ నిర్లక్ష్యం – కాంగ్రెస్ హయాంలో వేగవంతమైన పనులు
గత బి ఆర్ ఎస్ హయంలో కౌడిపల్లి మండల కేంద్రంలో 50 పడకల సిహెచ్సి ని మంజూరు చేసి నిర్మాణం తలపెట్టిన గత పాలకుల నిర్లక్ష్య కారణంగా నిర్మాణం నత్త నడకగా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో నిర్మాణం వేగవంతం చేసి పూర్తి చేయగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు వారు మంత్రికి వివరించారు. గతంలో వారి విజ్ఞప్తి మేరకు కౌడిపల్లి సిహెచ్సికి డయాసిస్ సెంటర్ ను మంత్రి అదనంగా మంజూరు చేయించడం హర్షినియమని వారు గుర్తు చేశారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి నీ సైతం కలిసి సిహెచ్సి ప్రారంభ విషయాలపై వివరించినట్లు వారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు వివరించారు. కౌడిపల్లి మండలంలో అధికంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సలు చేయించుకోవడానికి డబ్బులు అధికం కావడంతో చేయించుకోలేక నిరాశ నిస్పృహతో తమ జీవితాలను వెలగదీస్తున్నారని త్వరగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ప్రారంభించినట్లయితే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా లభించడంతోపాటు అందరికీ ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వారు మంత్రికి తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌడా శ్రీనివాస్ గుప్తా, విశ్రాంతి ఉపాధ్యాయుల సంఘం నాయకులు పుండరీకం గౌడ్, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కిషోర్ గౌడ్, కౌడిపల్లి గ్రామ ఉపసర్పంచ్ శ్వేతా మల్లికార్జున్ గౌడ్. వార్డు సభ్యులు దేవేందర్ కుమార్, అజ్జమెరి రమేష్ నాయక్, లక్ష్మీశరత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాగుల భూమయ్య పటేల్, మండల కాంగ్రెస్ నాయకులు ఓబులాష్ రమేష్ గౌడ్, ఆరిఫ్, దర్జీ రమేష్, మురళి నాయక్ తదితరులు కలరు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

