Telangana Electricity:తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇళ్లలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇప్పటికే దీని కోసం 25 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పక్రియ వేగంగా మొదలుకానుంది.
Read also: ESI Hospital:దేశవ్యాప్తంగా 7 ఈఎస్‌ఐ ఆరోగ్య ప్రాజెక్టులకు ప్రారంభించిన కేంద్రమంత్రి
Smart Prepaid Meters in Telangana
రైతులకు భారీ ఊరట
సాధారణ ఇళ్లకు ఈ మీటర్లు తప్పనిసరి చేస్తున్నప్పటికీ, వ్యవసాయ రంగానికి దీని నుండి మినహాయింపు ఇచ్చారు. రైతులకు అందే ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ విధానం కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీని వల్ల విద్యుత్ వాడకంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయని, వినియోగదారులు తమకు నచ్చినంత విద్యుత్తును ముందుగానే రీఛార్జ్ చేసుకునే సదుపాయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Telangana Electricity:విద్యుత్ ఆదా, అక్రమాలకు చెక్
ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ రంగంలో కొత్త మార్పులు రానున్నాయి. ముఖ్యంగా విద్యుత్ దొంగతనాలు పూర్తిగా అరికట్టవచ్చు. వినియోగదారులు తమ రోజువారీ వాడకాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ యాప్ ద్వారా చూసుకోవచ్చు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఆలస్యం ఉండదు, మీ బ్యాలెన్స్ అయిపోయాక మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ సరికొత్త టెక్నాలజీ వల్ల విద్యుత్ వృథా తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా సరఫరా మెరుగుపడుతుంది.
Epaper: epaper.vaartha.com
త్వరలో ప్రారంభం కానున్న పనులు వరంగల్ ఎయిర్‌పోర్టు పనులు.. కేంద్రమంత్రి

