Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలోనే భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

త్వరలోనే భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

వార్త 3 months ago

Power charges hike: దేశంలో సామాన్యులకు త్వరలోనే పెద్ద షాక్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వం కరెంట్ బిల్లులను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ అథారిటీ ఒక కీలకమైన విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తీసుకువచ్చింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోలార్ పవర్ వాడకం బాగా పెరుగుతోంది. దీనివల్ల విద్యుత్ కంపెనీలకు రావాల్సిన ఆదాయం తగ్గి నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాల నుంచి డిస్కంలను గట్టెక్కించేందుకు ఫిక్స్‌డ్ ఛార్జీలను పెంచాలని కేంద్రం యోచిస్తోంది.

Read also: CM Vijay: విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారుల గుట్టు చెప్తే లక్ష రూపాయల బహుమతి

 Electricity Charges Hike Proposal

రూఫ్‌టాప్ సోలార్ ఎఫెక్ట్.. నష్టాల్లో డిస్కంలు

చాలా పరిశ్రమలు, సంపన్న కుటుంబాలు తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీనివల్ల వారు సొంతంగా కరెంట్ తయారు చేసుకుంటూ గ్రిడ్ నుంచి విద్యుత్ కొనడం తగ్గించేశారు. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే ప్రభుత్వ కరెంట్ వాడుతున్నారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు రాబడి బాగా పడిపోయింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి, గ్రిడ్ నిర్వహణ ఖర్చులను అందరి నుంచి వసూలు చేయడానికి ఈ కొత్త నిబంధనలు తెస్తున్నారు.

Power charges hike: 2030 నాటికి కొత్త టారిఫ్.. ఎవరికి ఎంత భారం?

ఈ స్థిర ఛార్జీలను ఒకేసారి కాకుండా దశలవారీగా పెంచుతారు. రాబోయే 2030 నాటికి గృహ, వ్యవసాయ వినియోగదారుల నుంచి 25 శాతం స్థిర ఖర్చులను వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారుల నుంచి 100 శాతం స్థిర ఛార్జీలను వసూలు చేయనున్నారు. దీనివల్ల మీరు కరెంట్ తక్కువగా వాడినా కూడా నెలవారీ కనీస ఛార్జీల రూపంలో ఎక్కువ బిల్లు చెల్లించాల్సి వస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మైనారిటీ వర్గాలను లక్ష్యంగా బీజేపీ దాడులు: మమతా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha