Air India : టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియాను (Air India) గత నాలుగేళ్లుగా సరికొత్తగా పునర్నిర్మించామని ఆ సంస్థ సీఈఓ మరియు ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ ప్రకటించారు.
అయితే, ఈ ఏడాది చివర్లో తాను ఈ పదవి నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో తాను మరో పూర్తికాల కార్యనిర్వాహక (Executive) పదవిని చేపట్టే ఆలోచనలో లేనని, విమానయాన రంగానికి దాదాపు స్వస్తి పలికే యోచనలో ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Read Also: Israel: ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు
Air India
విమానాల డెలివరీ ఆలస్యంపై అసంతృప్తి: విస్తరణే తదుపరి సవాలు
ఎయిర్ ఇండియాను ఉన్నత ప్రమాణాల్లోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయని, అయితే కొన్ని అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయని విల్సన్ అభిప్రాయపడ్డారు. తాము ఆర్డర్ చేసిన కొత్త విమానాలు షెడ్యూల్ ప్రకారం డెలివరీ కాకపోవడం సంస్థ వృద్ధిని, విమానాల ఆధునీకరణను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ సీట్ల సరఫరా గొలుసులో ఉన్న పరిమితుల వల్ల ప్రస్తుతం ఉన్న వైడ్ బాడీ విమానాల రెట్రోఫిటింగ్ (ఆధునీకరణ) పనులు ఆలస్యమయ్యాయని, ఇది తమ నియంత్రణలో లేని విషయమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి సకాలంలో జరిగి ఉంటే ఎయిర్ ఇండియా పరివర్తన మరింత వేగంగా జరిగేదని అన్నారు.
Air India : 30 ఏళ్ల ప్రయాణం.. అందుకే తప్పుకుంటున్నా!
తన నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని విల్సన్ వివరించారు. “విమానయాన రంగంలో నా 30 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 8 నుంచి 9 దేశాల్లో నివసించాను. దిల్లీలో గడిపిన సమయాన్ని ఆస్వాదించినప్పటికీ, నా సొంత దేశమైన న్యూజిలాండ్‌ను మిస్ అవుతున్నాను. నాలుగేళ్ల బాధ్యతల తర్వాత తప్పుకోవాలని ముందే అనుకున్నాను, కొత్త నాయకత్వానికి ఇదే సరైన సమయం” అని ఆయన చెప్పుకొచ్చారు. 2022లో బాధ్యతలు చేపట్టిన క్యాంప్‌బెల్ విల్సన్ పదవీకాలం వాస్తవానికి 2027 జూన్ వరకు ఉంది. కానీ సేవల నాణ్యత, సమయపాలనలో ఆశించిన మార్పులు రాకపోవడం, అలాగే గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన 2026 ఏప్రిల్‌లోనే రాజీనామా సమర్పించారు. కొత్త సీఈఓ వచ్చే వరకు ఆయన బాధ్యతల్లో కొనసాగుతారు. వారసుడిని ఎంపిక చేసేందుకు ఎయిర్ ఇండియా ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోడీ.. నేడు NDA నేతలతో భేటీ

