Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్విషాశర్మ మృతి కేసులో సీసీటీవీ ట్విస్ట్.. అసలేం జరిగింది?

ట్విషాశర్మ మృతి కేసులో సీసీటీవీ ట్విస్ట్.. అసలేం జరిగింది?

వార్త 6 days ago

Tvisha Sharma death case: భోపాల్‌లో ఎంబిఏ గ్రాడ్యుయేట్ ట్విషాశర్మ, న్యాయవాది అయిన సమర్థ్ సింగ్‌కు ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడి. అది ప్రేమగా మారి, డిసెంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

పెళ్లయిన కొన్ని నెలలకే, అత్తింటి నివాసంలో ట్విషాశర్మ ఉరివేసుకుని శవమై కనిపించింది. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, కట్నం కోసం వేధించి చేసిన హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె మరణానికి సంబంధించిన పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Read Also : Palghar Road Accident: పాల్ఘర్ రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం.. 30 మందికి గాయాలు!

Twisha Sharma death case: అసలేం జరిగింది?

తాజాగా ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఆమె మరణానికి సరిగ్గా గంట ముందు జరిగిన పరిణామాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. ట్విషాశర్మ ఒంటరిగా ఇంటి టెర్రస్‌పైకి నడుచుకుంటూ వెళ్లడం, ఆ తర్వాత గంట వ్యవధిలోనే ఆమె భర్త సమర్థ్ సింగ్, మరో ఇద్దరు వ్యక్తులు ఆమె మృతదేహాన్ని మెట్ల మార్గంలో కిందికి తీసుకురావడం వంటి దృశ్యాలు ఈ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సరికొత్త ఆధారాలు ఇప్పుడు కేసును మరిన్ని మలుపులు తిప్పుతున్నాయి. ఈ ఘోరం మే 12న జరగ్గా, ఫుటేజీలో మాత్రం మే 10 అని చూపిస్తోందని, అందువల్ల సాంకేతిక వివరాలను సరిచూడాలని వారు పోలీసులను కోరారు.

పరారీలో భర్త..

ఈ కేసులో నిందితుడిగా ఉన్న భర్త సమర్థ్ సింగ్ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. తాజాగా సోమవారం అతడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై స్థానిక కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ఇప్పటికే ముందస్తు బెయిల్ లభించింది. సమర్థ్ సింగ్‌ను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, అతని సమాచారం ఇచ్చిన వారికి రూ.10,000 రివార్డు కూడా ప్రకటించామని ఏసీపీ రజనీశ్ కశ్యప్ కౌల్ తెలిపారు. అతడు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ పాస్‌పోర్ట్ కార్యాలయానికి సమాచారం అందించారు.

ప్రస్తుతం ఇరు కుటుంబాల మధ్య ఆరోపణల పర్వం నడుస్తోంది. సమర్థ్ సింగ్ తన బెయిల్ పిటిషన్‌లో ట్విషకు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోందని పేర్కొన్నారు.చనిపోయిన తమ కుమార్తె ప్రతిష్ఠను భంగపరిచేందుకు అత్తింటివారు ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, వాట్సాప్ చాటింగ్‌లను నిశితంగా పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న సమర్థ్ సింగ్ దొరికితేనే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

టీ తాగుదామని పిలిచి బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha