Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. నినాదాలతో హంగామా

విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. నినాదాలతో హంగామా

వార్త 3 months ago

Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రాకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కిన ఆమెను కొందరు వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేయడం వివాదానికి దారితీసింది.

ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు అధికారిక ఫిర్యాదు చేశారు.

గురువారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు మహువా మొయిత్రా ఇండిగోకు చెందిన 6ఈ 719 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత డోర్లు తెరుచుకునేలోపే కొందరు వ్యక్తులు ఆమె చుట్టూ చేరి నినాదాలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తమను లక్ష్యంగా చేసుకుని "చోర్ చోర్", "టీఎంసీ చోర్" అంటూ నినాదాలు చేశారని తెలిపారు.

అంతేకాకుండా కొందరు వ్యక్తులు మొబైల్ ఫోన్లలో వీడియోలు కూడా తీశారని మహువా ఆరోపించారు. ఇది సాధారణ నిరసన కాదని, రాజకీయంగా అవమానించే ప్రయత్నమని ఆమె మండిపడ్డారు. విమానంలో తన భద్రతకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

Read ALso : TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!

ఈ ఘటనపై ఆమె సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, ఇది ఒక రాజకీయ (Mahua Moitra) సంస్కృతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. విమాన సిబ్బంది కూడా ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేవలం చూస్తూ నిల్చున్నారని విమర్శించారు. దీంతో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.

డీజీసీఏకు ఇచ్చిన ఫిర్యాదులో, తనపై అసభ్యకర నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహువా మొయిత్రా కోరారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఇండిగో సంస్థపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

త్వరలో స్థానిక ఎన్నికలు.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha