Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVKకి మద్దతు ప్రకటించిన VCK.. మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో!

TVKకి మద్దతు ప్రకటించిన VCK.. మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో!

వార్త 3 months ago

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగు వేసింది.

తాజాగా విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ విజయ్ నాయకత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి.

Read Also : సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య?

విజయ్ కూటమికి పెరిగిన బలం

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు వీసీకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించగా, ఇప్పుడు వీసీకే తోడవ్వడంతో టీవీకే కూటమి బలం అసెంబ్లీలో 114కు చేరుకుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118.

Tamil Nadu Politics: మ్యాజిక్ ఫిగర్ కోసం ఉత్కంఠ

కూటమి బలం 114కు చేరినప్పటికీ, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి విజయ్‌కు ఇంకా నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతానికి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో, మిగిలిన స్వతంత్రులు లేదా చిన్న పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో టీవీకే వ్యూహకర్తలు నిమగ్నమయ్యారు.

మారుతున్న సమీకరణాలు

దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి గండి కొడుతూ విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ పట్టు సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దళిత సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్న వీసీకే, విజయ్‌తో చేతులు కలపడం వల్ల టీవీకేకు సామాజికంగా కూడా బలం పెరిగినట్లయింది. త్వరలోనే విజయ్ గవర్నర్‌ను కలిసి తనకున్న మద్దతును వివరించి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడి నుండి లభిస్తుందనే అంశంపై ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో AIADMK

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha