Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం

ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం

వార్త 2 months ago

CM Revanth Reddy News: ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం: హైదరాబాద్: ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టే సామాన్యులకు ప్రభుత్వం అండగా నిలిస్తే ఆ సంతోషమే వేరు.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ఎంతోమందిని కాపాడి, ‘ట్యాంక్ బండ్ శివ’గా పేరుగాంచిన శివకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గొప్ప ఊరటనిచ్చారు.

Read Also : Tamil Nadu Election 2026 : కేరళ గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహం

రూ.5 లక్షల సాయం.. కుమారుడికి సర్కారీ కొలువు

గత కొంతకాలంగా కుటుంబ పోషణ భారమై, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శివ దీనస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అతనికి సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే మంగళవారం శివను సచివాలయానికి పిలిపించుకున్న సీఎం, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, శివ కుటుంబానికి శాశ్వత జీవనోపాధి కల్పించేలా అతని కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగాన్ని కేటాయించారు. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని స్వయంగా ముఖ్యమంత్రి శివకు అందజేశారు.

 CM Revanth Reddy provides huge help to Tank Bund Shiva.. Home Guard job for his son

CM Revanth Reddy News: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన శివ

నిస్వార్థంగా ప్రాణాలు కాపాడుతున్న తనకు ప్రభుత్వం ఇంత పెద్ద గౌరవం ఇవ్వడంపై శివ ఉద్వేగానికి లోనయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో ముఖ్యమంత్రి తనను పిలిచి మరీ సాయం చేయడం మర్చిపోలేనని, తన కుమారుడికి ఉద్యోగం రావడం వల్ల కుటుంబం నిలదొక్కుకుంటుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలను కాపాడే యోధులను ప్రభుత్వం ఏనాడూ విస్మరించదని ఈ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా శివకు దక్కిన ఈ గుర్తింపు పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

సింగరేణిలో కొత్త కార్మిక సంఘం ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha