Karnataka Road Accident: కర్ణాటకలోని విజయనగర జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబళించింది.
అతివేగంగా వచ్చిన ట్యాంకర్ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Delhi Case Updates:ఢిల్లీ అత్యాచార కేసు లో విస్తుపోయే నిజాలు

Karnataka Road Accident: వంతెన పైనుంచి పడిపోయిన వాహనాలు
విజయనగర జిల్లా టీబీ డ్యామ్ సమీపంలోని జాతీయ రహదారి 50పై ఈ ఘోర ప్రమాదం సంభవించింది. హుళిగెమ్మ ఆలయంలో పూజలు ముగించుకుని భక్తులు ట్రాక్టర్‌పై తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక ట్యాంకర్ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. వేగానికి రెండు వాహనాలు అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 10 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఆర్జీ కార్ అత్యాచారం-హత్య కేసులో లోపాలపై ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్

