Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీ అత్యాచార కేసు లో విస్తుపోయే నిజాలు

ఢిల్లీ అత్యాచార కేసు లో విస్తుపోయే నిజాలు

వార్త 1 week ago

Delhi Case Updates: దేశ రాజధానిలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని అనడానికి హర్దోయ్ తరహాలోనే ఈ ఢిల్లీ ఘటన మరో నిదర్శనం. ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై ఆ బస్సు డ్రైవర్ మరియు క్లీనర్ సామూహికంగా అత్యాచారానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

కుటుంబాన్ని పోషించుకోవడానికి బయటకు వచ్చిన బాధితురాలికి, భద్రత కల్పించాల్సిన వాహనమే నరకాన్ని చూపించింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో నిందితులు కటకటాల పాలయ్యారు.

Read Also:NEET Paper Leak Case Update: మరో నిందితుడు ధనంజయ్ అరెస్ట్!

Delhi Case Updates: నిందితులు డ్రైవర్, క్లీనర్.. 36 చలాన్లు ఉన్నా రోడ్లపై తిరుగుతున్న బస్సు

అయితే, ఈ కేసులో బయటపడిన సాంకేతిక వైఫల్యాలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. సదరు బస్సుపై గత ఏడాది కాలంగా 36 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నా, అది రోడ్లపై ఎలా తిరుగుతోందనేది అంతుచిక్కని ప్రశ్న. సుమారు రూ. 3.3 లక్షల జరిమానా ఉన్నప్పటికీ, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ పేరుతో ఢిల్లీ-బీహార్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. భద్రతా కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఇంతటి ఘోరం జరగడం మరియు నిబంధనలను బేఖాతరు చేసే వాహనాలు స్వేచ్ఛగా తిరగడంపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ మరియు రవాణా శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముగ్గురు చిన్న పిల్లల తల్లి అయిన బాధితురాలికి న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha