Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా

వార్త 2 months ago

KPS Medicare Free Medical Camp: కెపిఎస్ సంస్థ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని… తమ ఆరోగ్యాన్ని సంరక్షించు కోవాలని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా సూచించారు.

గుత్తి పట్టణంలో ఆదివారం కర్నూలు చెందిన కెపిఎస్ మెడికేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరము ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండి కొట్రికే హితేష్ తో పాటుగా డాక్టర్లు ఇస్మాయిల్, అక్షిత్, రోహిత్, రాఘవేంద్ర ,మధుసూదన్ యాదవ్, కిరణ్, లతో కూడిన వైద్య బృందం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Read Also: Pawan Kalyan: "నా ఆరోగ్యం నిలకడగా ఉంది".. శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ తొలి ట్వీట్

KPS Medicare Free Medical Camp: ప్రతి నెలా వైద్య శిబిరాలు

అవసరమైన వారికి రక్త పరీక్షలు చేశారు. అనంతరం జనరల్ మెడిసిన్, యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, తదితర విభాగాలలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండి కొట్రికే హితేష్ మాట్లాడుతూ ప్రతినెల ప్రజానీకం సౌకర్యార్థం ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకొని వైద్య శిబిరంలో నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన కాన వచ్చింది. దాదాపు వెయ్యి మందికి పైగా రోజులకు శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు నాగ రంగప్రసాద్, వలి సాహెబ్, పసుపులేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha