Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Udit Narayan: సింగర్ పై సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య

Udit Narayan: సింగర్ పై సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య

వార్త 4 months ago

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌ (Udit Narayan) పై ఆయన మొదటి భార్య రంజన ఝా చేసిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.1996లో చెకప్ కోసమంటూ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లి తన అనుమతి లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని బీహార్‌లోని సుపాల్‌లో గల మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.

ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు సంజయ్ కుమార్ ఝా, లలిత్ నారాయణ్ ఝా, రెండో భార్య దీపా నారాయణ్‌పై ఆమె ఆరోపణలు చేశారు.

Film fare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. తెలుగు సినిమాల జోరు

గౌరవం కావాలి

న్యాయం కోసం తాను ముంబైలోని ఉదిత్ నారాయణ్ ఇంటికి వెళ్లినప్పుడు, తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని రంజనా ఆరోపించారు. అక్కడి నుంచి నేపాల్‌లోని తన అత్తవారింటికి వెళ్లినా అక్కడ కూడా ఆదరణ లభించలేదని, చివరకు తన పుట్టింట్లోనే తలదాచుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

ప్రస్తుతం అనారోగ్యంతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆమె వెల్లడించారు.'నేను ఎవరినీ కించపరచడానికో లేక సంచలనం కోసమో ఇక్కడికి రాలేదు. నాకు నా హక్కులు, గౌరవం కావాలి. 30 ఏళ్లుగా నేను చీకట్లోనే ఉన్నాను. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను' అని రంజనా ఝా స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha