Health Security : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్. ఎం)లో పనిచేస్తు న్న ఉద్యోగులు తమ సర్వీసును రెగ్యులర్ తోపాటు ఇతర డిమాండ్‌ను నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె గత నెల 13 నుంచి చేపట్టారు.
నేటికీ నమ్మె 22 వ రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ఎం పరిధిలో 17,541 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధకేటగిరీల్లో 78 క్యాడర్లలో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తున్న వారిలో 70శాతం మంది ఎన్ హెచ్ఎం ఉద్యోగులు ఔట్సోర్సింగ్ వారే. వీరు ఏండ్ల తర బడి తకు 5 3వ వేతనాలతో పనిచేస్తూ కుటుంబ పోషణకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆపోతు న్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం, పట్టణ పేదలు మురికి వాడల ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో నికి తేవడం దీని ప్రధాన లక్ష్యాలు. దేశవ్యాప్తంగా 1.86 లక్షలకు పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా ఆధునీకరించి ఉచిత కౌన్సిలింగు, వ్యాధులు స్క్రీనింగు, మందుల పంపిణీ వంటి సేవలంది స్తున్నారు. ఆశాకార్య కర్తలు ప్రజలకు ఆరోగ్య వ్యవస్థకు మధ్యవారధిగా పని చేస్తున్నారు. గర్భి ణీలు ఆనుపత్రిలో ప్రసవించేలా ప్రోత్సహించే పథకాలు తల్లులు పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణకల్పించే టీకా కార్యక్ర మాలు ఆ ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నా యి. స్త్రీ వాల్త్మేషన్లో పనిచేసే వారు కాంట్రాక్ట బెట్సోర్సింగ్ లోనే ఈ సేవలందిస్తున్న సిబ్బందిలో చాలామంది కాంట్రాక్టు లేదా గౌరవ వేతన పద్ధతిలో పనిచేస్తుండటం ప్రధాన సమస్యగా మిగిలింది.
Health Security
Health Security : ప్రతిపౌరుడికి నాణ్యమైన వైద్యం
దేశ వ్యాప్తంగా సుమారు 12 లక్షల మందికి పైగా ఆరోగ్య సిబ్బంది ఒప్పంద ప్రాథమికసేవలు అందిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంత కీలకంగా పనిచేస్తున్నవీరి సమస్యలు దీర్ఘకాలికంగా AA పెండింగ్‌లో ఉండటంతో అన్నిరంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి ఆందోళన బాటపట్టినారు. సమ్మెలో ఎన్ హెచ్ఎం ఉద్యోగులు గత నేల 13 నుంచి ఉద్యోగులు నమ్మెబాట పట్టడం వలన రోగులకు అవస్థలు తప్పడం లేదు. వారి సమస్యల పరిష్కారం కొరకు ఆ జిల్లాల కలె క్టరేట్లు, డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ఎదుట గత మూడు వారాలుగా నిరవధిక సమ్మె ం కొనసాగిస్తున్నారు. ఈనమ్మెతో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఎన్హెచ్ఎం పరిధిలోని 78 క్యాడర్ల ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా క్రమ బద్ధీకరించాలని, అప్పటివరకు సమానపనికి Q సమానవేతనం చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్చేస్తున్నారు. కేడర్ వారి గా వేతనాలు అమలు చేయడంతో పాటు పిఆర్సి, 5శాతం డిఏ, ఏటా ఐదు శాతం ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ కల్పించాలని కోరుతున్నారు. 2022 నుంచి పెంచాల్సిన ఐదు శాతం వేతనాన్ని చెల్లించాలని, ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని అలాగే ఔట్సో ర్సింగ్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి స్పర్శ 2.మ ద్వారా వేత నాలు చెల్లించాలని, ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ పరిధి లో కొనసాగించాలని, మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విధినిర్వహణ లో ఉద్యోగం మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్రేషియాతో పాటు కుటుంబంలో అరులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, జీవో 1195ను పునః పరిశీలించాలని, ఇంకా కొన్ని డిమాం డ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడే సిబ్బందికి భరోసా కల్పించినప్పుడే ప్రజారోగ్య వ్యవస్థ బలో పేతమై ప్రతిపౌరుడికి నాణ్యమైన వైద్యం అందుతుంది.
-ఉజ్జిని రత్నాకర్ రావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
కరెంట్ బిల్లు చూసి షాకవుతున్నారా? తెలంగాణలో కొత్త ఛార్జీలు అమల్లోకి!

