TG E-JAC Pending Issues Protest: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలంలో వినతి పత్రం సమర్పించారు.
మండల నాయబ్ తహసీల్దార్ కు జేఏసీ నాయకులు ఈ వినతిని అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను తక్షణమే అమలులోకి తీసుకురావడం వంటి డిమాండ్లను ప్రస్తావించారు.
అలాగే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1కు ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను విడుదల చేయడం, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ఉద్యోగ, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
TG E-JAC Pending Issues Protest: ఉపాధ్యాయ సంఘాల వినతి
ఉద్యోగులు, ఉపాధ్యాయుల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. డీ.ఏ, పీఆర్సీ, ఆరోగ్య కార్డులు, వివిధ రకాల బకాయిల చెల్లింపులు వంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ నిరసనలో భాగంగా శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు, మధ్యాహ్నం సమయంలో గుమ్మడిదల తాసిల్దార్ పరమేశ్వర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, వైద్య సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం చేస్తే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం. విజయ్‌కుమార్, మండల కన్వీనర్ అప్పర్ల రెడ్డి, వినయ్‌కుమార్, బి. లక్ష్మణ్, కె. సతీష్ రావు, పవన్, వై. భీమయ్య, జూనియర్ అసిస్టెంట్ శశాంక్,ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కే. రాజారెడ్డి, విజయ్ కుమార్, వినోద్ కుమార్, నాగరాజు, పెంచలయ్య , అలాగే కార్యకర్తలు మురళి, అప్పిరెడ్డి, ఝాన్శిలక్ష్మి, సునిత, మీన అలాగే పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

