EPF : దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును ఏకంగా 8.25 శాతంగా ఖరారు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
దీనివల్ల దేశంలోని దాదాపు 8 కోట్ల మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ వడ్డీ రేటును వరుసగా మూడో ఏడాది కూడా అదే స్థాయిలో (8.25%) కొనసాగించడం గమనార్హం. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం స్థిరమైన వడ్డీని అందించడం పట్ల చందాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో

ఖాతాల్లో జమకు క్షేత్రస్థాయి ఆదేశాలు: కొద్ది రోజుల్లోనే అకౌంట్లలోకి నగదు
ఈ వడ్డీ ఖరారు ప్రక్రియ ముగియడంతో, లబ్ధిదారుల ఖాతాల్లోకి వడ్డీ మొత్తాన్ని త్వరితగతిన డిపాజిట్ చేయాలని ఈపీఎఫ్ఓ అన్ని క్షేత్రస్థాయి కార్యాలయాలకు (Field Offices) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాంకేతిక ప్రక్రియ వేగవంతమై, రాబోయే కొద్ది రోజుల్లోనే EPF సభ్యులందరి వ్యక్తిగత అకౌంట్లలో వడ్డీ డబ్బులు అధికారికంగా జమ కానున్నాయి. ఉద్యోగులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఉమంగ్ (UMANG) యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా తమ ఖాతాల్లో వడ్డీ జమ అయిందో లేదో సులభంగా తనిఖీ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. రిటైర్మెంట్ నిధిపై ఈ రకమైన స్థిరమైన రాబడి రావడం మధ్యతరగతి ఉద్యోగుల పొదుపుకు మరింత ఊతాన్ని ఇస్తుంది.
ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. విశాఖ - బెంగళూరు వీకెండ్ స్పెషల్ రైళ్లు పొడిగింపు

