Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉమ్మడి దళాల సుదీర్ఘ గాలింపు చర్యలు

ఉమ్మడి దళాల సుదీర్ఘ గాలింపు చర్యలు

వార్త 1 month ago

Vizag Fishermen Missing: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల జులై 4న మత్స్యకారుల బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ (Indian Navy), కోస్ట్ గార్డ్ (Coast Guard) మరియు స్థానిక మెరైన్ పోలీసులు సంయుక్తంగా అత్యాధునిక హెలికాప్టర్లు, స్పీడ్ బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

నిబంధనల ప్రకారం 72 గంటల పాటు సముద్ర గర్భంలో గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపును పొడిగించినా ఫలితం లేకపోవడంతో అధికారికంగా సెర్చ్ ఆపరేషన్‌ను ముగించారు. ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో మునిగిపోయి ఉండవచ్చనే అనుమానంతో, వారి మృతదేహాలు ఎక్కడైనా ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉందేమోనని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖతో పాటు చుట్టుపక్కల ఉన్న తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని తీరప్రాంత రక్షణ దళాలను (కోస్టల్ సెక్యూరిటీ) ఆదేశించారు. స్థానిక మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశారు.

Read Also: Nara Lokesh South Korea Tour: ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేశ్ కీలక పర్యటన

 Vizag Fishermen Missing

Vizag Fishermen Missing : ప్రభుత్వం తరపున భారీ ఆర్థిక సాయం

ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రెండు రకాల ఆర్థిక ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌ను ఆదేశించారు.మత్స్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అదనంగా మరో రూ.5 లక్షల బీమా సొమ్మును అందించేందుకు అధికారులు పత్రాలను సిద్ధం చేస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా విశాఖపట్నం చేరుకున్నారు. ప్రమాదం నుండి సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన కారి చిన్నను, అలాగే గల్లంతైన జాలర్ల కుటుంబ సభ్యులను కలిసి ఆయన పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైతే మరికొంత అదనపు పరిహారం అందేలా ముఖ్యమంత్రితో మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంటి పెద్దలను కోల్పోయిన గంగపుత్రుల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర నిశ్శబ్దం, కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

నల్లమలలో అమరావతి ఆనవాళ్లు దొరికాయి - పవన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha