Sangareddy News: సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్కల్, చౌట్కూర్ మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆయుర్వేద ఆసుపత్రులు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.
Sangareddy News: ప్రభుత్వ కార్యాలయాల్లో మిన్నంటిన ఉత్సాహం

చౌట్కూర్ పుల్కల్ తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో తహసీల్దార్ కిష్టయ్య, పుల్కల్ తాసిల్దార్ కృష్ణ ఎంపీడీవో శంకర్, పుల్కల్ ఎంపీడీవో. ఆనంద్ మేరీ డాక్టర్ సబిత వివిధ శాఖల అధికారులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కిష్టయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొంటూ, రాష్ట్ర సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

