Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉన్నట్టుండి కుండపోత.. మరుక్షణమే ఆకాశం నిర్మలం.. హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం!

ఉన్నట్టుండి కుండపోత.. మరుక్షణమే ఆకాశం నిర్మలం.. హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం!

వార్త 2 weeks ago

Hyderabad Rain: రోజురోజుకూ వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఉరుము లేదు.. మెరుపు లేదు.. కానీ పడితే మాత్రం గట్టిగా వర్షం దంచికొడుతోంది! కేవలం 15 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి.

చిత్రం ఏంటంటే.. ఆ తర్వాత నిమిషంలోనే వాన ఆగిపోయి, ఆకాశం మళ్లీ ప్రశాంతంగా, నిర్మలంగా మారిపోతోంది! ఏ నిమిషంలో వాన పడుతుందో తెలీని పరిస్థితి ఉంది కాబట్టి.. ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also : KCR Help To Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భారీ ఆర్థిక సాయం

 A sudden downpour, followed immediately by clear skies-bizarre weather in Hyderabad.

వాతావరణ నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఏర్పడుతున్న వేడి, ఆర్ద్రత (Humidity) వల్ల అకస్మాత్తుగా మేఘాల సాంద్రత పెరిగి పాసింగ్ షవర్స్ (Passing Showers) లేదా విడతల వారీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరహా వానల్లో కేవలం 15 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే రోడ్లు జలమయమయ్యే స్థాయిలో వర్షపాతం నమోదువుతోంది. సడన్‌గా కురిసే తీవ్రమైన వానల వల్ల వాహనదారులు, బాటసారులు షాక్‌కు గురవుతున్నారు. నీరు నిలిచిపోయే సమయానికే మేఘాలు విడిపోయి పొడి వాతావరణం ఏర్పడుతోంది.

Hyderabad Rain: ప్రయాణికులు జాగ్రత్త వహించాలి!

ముందస్తు సూచన లేకుండా విరుచుకుపడుతున్న వానలతో నగరంలో ట్రాఫిక్ ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆకస్మిక విడతల వర్షాల పట్ల వాహనదారులు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు, బాటసారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (IMD) సూచించింది. గంటల వ్యవధిలోనే సీన్ మారిపోతుండటంతో రహదారుల దాటేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సరూర్‌నగర్ స్టేడియం వద్ద తోపులాట.. హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha