Saroornagar Stadium: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం తీవ్ర కలకలం రేగింది. హైడ్రా (HYDRAA) సంస్థలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన ప్రాథమిక ఈవెంట్లకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం ప్రాంగణంలో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
Read Also : Telangana Cheyutha Pension: పింఛన్‌దారుడి మరణానంతరం భార్య/భర్తకు వెంటనే పింఛన్ మంజూరు!
Scuffle at Saroornagar Stadium; unemployed youth flock for HYDRA jobs.
Saroornagar Stadium:150 పోస్టులకు పోటెత్తిన అభ్యర్థులు
హైడ్రా పరిధిలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) విభాగంలో 100 అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు.. మొత్తంగా 150 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగాల నియామకాల కోసం ఆగస్టు 8, 9 తేదీలలో ఉదయం 5 గంటల నుంచి సరూర్‌నగర్ స్టేడియంలో మైదాన పోటీలు (ఈవెంట్స్) నిర్వహిస్తామని హైడ్రా అధికారులు ప్రకటించారు. ఈ సమాచారంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు ఒక్కసారిగా స్టేడియం వద్దకు చేరుకున్నారు.
కఠినమైన ఈవెంట్స్.. క్యూలైన్లలో తీవ్ర గందరగోళ
ఈ నియామకాల్లో అర్హత సాధించాలంటే అభ్యర్థులు పలు కఠినమైన శారీరక దార్ఢ్య (PET) పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇందులో 800 మీటర్ల పరుగును 170 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉండగా, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో ముగించాలి. అలాగే లాంగ్ జంప్‌లో కనీసం 4 మీటర్ల దూరం దూకాలి. షాట్‌పుట్ (7.2 కిలోల బరువు) పోటీలో కనీసం 6 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది. ఈ అన్ని పరీక్షల్లో నిర్దేశించిన ప్రమాణాలను సాధించిన వారే తదుపరి ఎంపిక ప్రక్రియకు అర్హులవుతారు.
అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఒకేసారి స్టేడియం ప్రాంగణానికి చేరుకోవడం, లోపలికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో క్యూలైన్లు చెల్లాచెదరై తోపులాట జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.
మహాలక్ష్మి పథకంలో కీలక విస్తరణ.. మరో 5 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్

