VB-G RAM G Scheme:ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గిపోయి వ్యవసాయం సరిగా సాగడం లేదు. దీనివల్ల రైతులకు అలాగే రైతు కూలీలకు గ్రామాల్లో పని దొరకడం చాలా కష్టమైంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. VB-G RAM G ఉపాధి కల్పన పథకం 125 Days పాటు అందించాలని నిర్ణయించారు. దీనిద్వారా రానున్న 8 నెలల పాటు గ్రామాల్లో పెద్ద ఎత్తున కూలీలకు పనులు లభిస్తాయి. నవంబర్ 1 వ తేదీ నుంచి ఈ పనులన్నీ గ్రామాల్లో అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
Turmeric price: పసిడిలా మెరుస్తున్న పసుపు.. క్వింటా రూ.19 వేలు
Employment works for laborers for 125 days
8,83,845 అభివృద్ధి పనులకు భారీ నిధుల కేటాయింపు
రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు దాదాపు 8,83,845 పనులను సిద్ధం చేశారు. మొత్తం 31 జిల్లాల కలెక్టర్లు పంపిన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాగా రూ.3,825.31 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,550.21 కోట్లు కలిపి మొత్తం రూ.6,375.52 కోట్లతో నిధులు కేటాయించాయి. నీటి సంరక్షణ పనులకు ఈ పథకంలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. నల్గొండ జిల్లా 80,496 పనులతో మొదటి స్థానంలో నిలవగా, పెద్దపల్లిలో అత్యల్పంగా 8,464 పనులు ఉన్నాయి.
VB-G RAM G Scheme:జూన్ వరకు నిరంతర ఉపాధి హామీ పనులు
నవంబర్ 1 వ తేదీ నుంచి వచ్చే ఏడాది జూన్ నెల వరకు కూలీలకు పనులు నిరంతరంగా కొనసాగుతాయి. ప్రతి కూలీకి 125 రోజుల పాటు పని దినాలు కల్పించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రణాళికను అమలు చేయనున్నారు. గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వ్యవసాయం లేని ఈ కాలంలో కూలీల కుటుంబాలకు ఈ పనులు ఆర్థికంగా చాలా పెద్ద ఆసరాగా నిలుస్తాయి.
Epaper: epaper.vaartha.com

