Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
UPI ఆటోపేకు MDR వర్తించదు - కేంద్రం స్పష్టం

UPI ఆటోపేకు MDR వర్తించదు - కేంద్రం స్పష్టం

వార్త 2 weeks ago

UPI : డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. యూపీఐ ఆటోపే (UPI AutoPay) ద్వారా జరిగే ఆటోమేటిక్ డిజిటల్ చెల్లింపులపై ఎటువంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు వర్తించవని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

సామాన్య వినియోగదారులు నెలవారీగా చెల్లించే కరెంట్ బిల్లులు, డీటీహెచ్, ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు మరియు మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ (SIP) వంటి ఆటో-డెబిట్ లావాదేవీలన్నీ ఈ మినహాయింపు పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనివల్ల వినియోగదారులపై గానీ, సేవలు అందించే ప్లాట్‌ఫారమ్‌లపై గానీ అదనపు భారం పడదని ప్రభుత్వం తెలియజేసింది.

రూ.2,000 దాటినా మినహాయింపు - క్లారిటీ ఇచ్చిన కేంద్రం

భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపు నిబంధనల్లో ఎలాంటి మార్పులు వచ్చినప్పటికీ, యూపీఐ ఆటోపే ఆధారిత లావాదేవీలకు పూర్తి రక్షణ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. సాధారణ యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లలో రూ.2,000 కు మించిన కొన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఛార్జీల ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఆటోపే (UPI Mandates) ద్వారా జరిగే లావాదేవీలకు మాత్రం రూ.2,000 పరిమితితో సంబంధం లేకుండా ఎలాంటి అదనపు రుసుములు విధించబోమని హామీ ఇచ్చింది. రోజువారీ సేవలు, క్రమబద్ధమైన పెట్టుబడులకు డిజిటల్ రూపంలో అడ్డంకులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు 3.46 లక్షల గ్రామీణ గృహాలను మంజూరు చేసిన కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha