Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
UPI పేమెంట్స్ పై ఛార్జీ.. యూజర్లలో ఆందోళన

UPI పేమెంట్స్ పై ఛార్జీ.. యూజర్లలో ఆందోళన

వార్త 2 weeks ago

UPI : యూపీఐ (UPI) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ జరిపే వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించడంపై వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ రుసుములు కేవలం వ్యాపారులకే వర్తిస్తాయని, సాధారణ వినియోగదారులకు యూపీఐ సేవలు సంపూర్ణంగా ఉచితమని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తే బ్యాంకులు తమ వద్ద నుంచి కమిషన్ కోత విధిస్తాయనే నెపంతో చిన్న, మధ్యతరగతి వ్యాపారులు యూపీఐ పేమెంట్లను నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ధరల పెంపు, నగదు వైపే వ్యాపారుల మొగ్గు?

ఈ నూతన నిబంధనల వల్ల వ్యాపారులు డిజిటల్ క్యూఆర్ (QR) కోడ్ల ద్వారా పేమెంట్లు తీసుకోకుండా, నేరుగా నగదు (Cash) ఇవ్వాలని వినియోగదారులపై ఒత్తిడి తెచ్చే ప్రమాదముందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఎంత నివారించినా వ్యాపారులు తమకు పడే MDR ఛార్జీల భారాన్ని వస్తువుల ధరలు పెంచడం ద్వారా లేదా విడిగా కమిషన్ల రూపంలో వినియోగదారుల పైనే మోపే అవకాశముంది. రూ. 2,000 దాటితే ఛార్జీల భయం కారణంగా మళ్లీ నగదు రహిత లావాదేవీల నుండి పాత పద్ధతిలోనే క్యాష్ చెల్లింపులకు మళ్లే పరిస్థితులు ఏర్పడతాయని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

చోరీకి వెళ్లి గ్రిల్స్‌లో చిక్కుకున్న చోరుడు: స్థానికుల దాడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha