UPI : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) డిజిటల్ లావాదేవీలపై ఛార్జీల విధింపుకు సంబంధించి పార్లమెంట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ చట్టం-2007’ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై సభలో ఎలాంటి చర్చ లేకుండానే వేగంగా ఆమోదముద్ర వేయడం గమనార్హం. ఈ నూతన చట్ట సవరణ ప్రకారం, యూపీఐ పేమెంట్స్‌పై నిర్దిష్ట ఛార్జీలను నిర్ణయించి వినియోగదారుల నుంచి వసూలు చేసే పూర్తి స్వేచ్ఛ మరియు అధికారాలను బ్యాంకులకు అప్పగించారు. ఇప్పటివరకు ఉచితంగా డిజిటల్ లావాదేవీల సేవలను పొందుతున్న సామాన్య వినియోగదారులు, చిన్న తరహా వ్యాపారులపై ఈ నిర్ణయం నేరుగా ఆర్థిక భారం మోపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
UPI Paymentsశాసన ప్రక్రియ తదుపరి దశలు: రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి రాజముద్ర
లోక్‌సభలో పసైన ఈ సవరణ బిల్లును తదుపరి ఆమోదం కోసం రాజ్యసభకు పంపనున్నారు. రాజ్యసభలో కూడా బిల్లు నెగ్గిన అనంతరం, తుది అనుమతి కోసం భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర (రాజముద్ర)కు పంపుతారు. రాష్ట్రపతి సంతకం పూర్తికాగానే ఈ చట్ట సవరణ అధికారికంగా గెజిట్ రూపంలో అమల్లోకి రానుంది. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే, బ్యాంకులు తమ నిర్వహణ వ్యయాలను ప్రాతిపదికగా తీసుకుని ఉచిత లావాదేవీలపై పరిమితులు విధిస్తూ, పరిమితి దాటిన సేవలకు ఛార్జీలు విధిస్తాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ఊతమిచ్చిన యూపీఐ వ్యవస్థపై ఈ ఛార్జీల నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఉత్కంఠగా మారింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే - అభిజీత్ దీప్కే

