Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.. పవన్‌ సమక్షంలో ఐఐటీ మద్రాస్‌తో ఎంఓయూ

ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.. పవన్‌ సమక్షంలో ఐఐటీ మద్రాస్‌తో ఎంఓయూ

వార్త 1 week ago

Uppada beach erosion: కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు చాలాకాలంగా ఎదుర్కొంటున్న సముద్ర కోత సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగు ముందుకు వేసింది.

ఇందులో భాగంగా తీర పరిరక్షణ పనుల కోసం ప్రముఖ ఐఐటీ మద్రాస్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి.

రూ.323 కోట్లతో అత్యాధునిక రక్షణ గోడ నిర్మాణం

కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్డీఎంఎఫ్) ఆమోదంతో సుమారు రూ.323 కోట్ల భారీ వ్యయంతో ఉప్పాడ తీరంలో పటిష్టమైన రక్షణ గోడను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) రూపకల్పన, డిజైన్లు మరియు నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ ఐఐటీ మద్రాస్ నిపుణులే స్వయంగా చూసుకోనున్నారు. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా సముద్రపు అలల తీవ్రతకు తట్టుకునేలా ఈ రక్షణ గోడను రూపొందించనున్నారు.

Uppada beach erosion: భాగస్వామ్య శాఖలు మరియు నవంబర్ నుంచి నిర్మాణ పనులు

ఈ ప్రాజెక్టు సజావుగా సాగేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) నోడల్ ఏజెన్సీగా, ఏపీ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా వ్యవహరించనున్నాయి. సముద్రపు ప్రవాహాలు, కోత తీవ్రతను క్షుణ్ణంగా పరిశీలించిన ఐఐటీ బృందం అత్యంత అనువైన రక్షణ చర్యలను సూచించనుంది. అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి కావడంతో, పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ తీర గ్రామాలు, మత్స్యకారుల రక్షణార్థం వచ్చే నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర డేటా సెంటర్లకు ఎంత నీరు కావాలో స్పష్టం చేసిన చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha