Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉప్పల్‌లో 'అభిషేక్' సునామీ: 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఉప్పల్‌లో 'అభిషేక్' సునామీ: 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

వార్త 2 months ago

Abhishek Sharma Fastest Half Century: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సాక్షిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

పరుగుల దాహంతో ఉన్న ఈ యువ బ్యాటర్ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఐపీఎల్‌లో తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు.మాథ్యూ షార్ట్ వేసిన 5వ ఓవర్లో రెచ్చిపోయిన అభిషేక్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు.

Read Also: IPL 2026 - SRH Vs CSK : 15 బాల్స్ లో అభిషేక్ 50 రన్స్

మాథ్యూ షార్ట్ ఓవర్లో ఊచకోత

మరో రికార్డ్ నెలకొల్పాడు. ఇవాళ చెన్నైతో మ్యాచులో చెలరేగడంతో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అందులో 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అయితే అభిషేక్ శర్మకు IPLలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.2024 ఎడిషన్‌లో 16 బంతుల్లో ట్రావిస్ హెడ్, అభిషేక్‌లు ఫిఫ్టీతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) పేరిట ఉంది. 2023 సీజన్‌లో ఈ చిచ్చరపిడుగు కోల్‌కతాపై కేవలం 13 బంతుల్లోనే యాభైతో చరిత్ర సృష్టించాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఉప్పల్ స్టేడియంలో సందడి చేసిన అభిమానులు.. ఇవిగో ఫోటోలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha