Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
15 బాల్స్ లో అభిషేక్ 50 రన్స్

15 బాల్స్ లో అభిషేక్ 50 రన్స్

వార్త 2 months ago

క్రీడల చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా ఐపీఎల్ 2026 సీజన్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పోరు నిలిచిపోయింది.

ముఖ్యంగా అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకుని, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థశతకాల జాబితాలో చేరిపోయాడు.

Read Also : AP Ministers Singapore Tour: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటనకు జీవో జారీ

టాస్ గెలిచిన CSK బౌలింగ్ ఎందుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. చెన్నై బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి స్టేడియంలోని అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. పవర్ ప్లే ముగియక ముందే హైదరాబాద్ స్కోరును భారీ స్థాయికి చేర్చి, సీఎస్‌కే కెప్టెన్‌ను రక్షణలో పడేశాడు.

ఊహించని మలుపు: హెడ్, ఇషాన్ వికెట్ల పతనం

అభిషేక్ ధాటికి హైదరాబాద్ భారీ స్కోరు సాధిస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో చెన్నై బౌలర్లు పుంజుకున్నారు. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరగా, ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ డక్ అవుట్ అయ్యాడు. వరుసగా రెండు కీలక వికెట్లు పడటంతో సన్‌రైజర్స్ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లింది. పరుగుల వేగం నెమ్మదించడంతో మ్యాచ్ మళ్లీ సమతూకంలోకి వచ్చింది.

చెన్నై బౌలర్ల వ్యూహం.. ఉత్కంఠగా పోరు

వరుస వికెట్లు తీయడంతో చెన్నై బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేశారు. అభిషేక్ శర్మ క్రియేట్ చేసిన ఊపును కొనసాగించడంలో మిగిలిన బ్యాటర్లు తడబడుతుంది. ప్రస్తుతం ఓవర్లు కు 83 రన్స్ కొట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha