Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఊర మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న మల్లారెడ్డి

ఊర మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న మల్లారెడ్డి

వార్త 2 weeks ago

Malla Reddy : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యేక హంగామా నెలకొంటుంది. వినూత్న శైలి, జోష్‌తో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంలో ఆయన శైలి వేరు.

ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో తనదైన 'ఊర మాస్' స్టెప్పులతో ఆయన మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో మల్లారెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. నిరసన శిబిరం వద్ద కేడర్‌ను ఉత్సాహపరుస్తూ, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టే క్రమంలో యువ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసి సరికొత్త జోష్ నింపారు.

బీఆర్‌ఎస్ విజయం సాధించాలంటూ సంకేతం

కాంగ్రెస్ 1,000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మల్లారెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావలసిన అవసరాన్ని తనదైన మాస్ శైలి ఆటపాటలతో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు, వినోదాత్మక విమర్శలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

చంద్రబాబు కు చెంచాగిరి చేయడమే రేవంత్ పని - KTR కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha