Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఊరేగింపులో 'డ్యాన్స్' రగడ..వివాహం రద్దు చేసిన తండ్రి!

ఊరేగింపులో 'డ్యాన్స్' రగడ..వివాహం రద్దు చేసిన తండ్రి!

వార్త 2 weeks ago

Markapuram Marriage Dispute: శుభం పలకాల్సిన పెళ్లి పందిట్లో డ్యాన్స్ వివాదం పెను తుఫాను సృష్టించింది. తెల్లవారితే మూడు ముళ్లు పడాల్సిన వేడుక..

కేవలం ఊరేగింపులో వధువు డ్యాన్స్ చేయకూడదంటూ వరుడు వేసిన ఆంక్షల కారణంగా పూర్తిగా రద్దయింది. పెళ్లికి ముందే కూతురిపై వరుడు ఆగ్రహం వ్యక్తం చేయడం నచ్చని వధువు తండ్రి.. అక్కడికక్కడే పెళ్లిని రద్దు చేసుకుని బంధువులతో సహా సొంతూరికి తిరుగుపయనమయ్యారు. ఈ వింత సంఘటన మార్కాపురం ప్రాంతంలో ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also :Tirupati Chain Snatching:నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 సవర్ల బంగారం అపహరణ!

అసలేం జరిగిందంటే.. ఉత్సాహంగా ఊరేగింపు

మార్కాపురం ప్రాంత పరిధిలోని రాచర్ల మండలం చిన్నగానిపల్లికి చెందిన ఒక యువకుడికి.. కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం పెళ్లి ముహూర్తం కుదిర్చారు. ఇందులో భాగంగా ఒక రోజు ముందుగానే, అంటే శనివారం రాత్రి వధువు తరపు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ పెళ్లి ఊరైన చిన్నగానిపల్లికి చేరుకున్నారు. రాత్రి వేళ సాంప్రదాయం ప్రకారం వధూవరులను ఒక వాహనంపై కూర్చోబెట్టి గ్రామంలో అట్టహాసంగా ఊరేగింపు (బరాత్) ప్రారంభించారు. ఈ వేడుకలో ఇరువైపుల బంధువులు, స్నేహితులు డీజే పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేశారు.

నువ్వు డ్యాన్స్ చేయొద్దు – వరుడి ఆంక్షలు

ఊరేగింపు జోరుగా సాగుతున్న సమయంలో.. వధూవరులు కూడా దిగి తమతో కలిసి రెండు స్టెప్పులు వేయాలని అక్కడ ఉన్నవారు ఒత్తిడి చేశారు. అందరి కోరిక మేరకు వధువు డ్యాన్స్ చేయడానికి సిద్ధపడగా.. వరుడు మాత్రం తాను డ్యాన్స్ చేయనని తెల్చిచెప్పాడు. అంతటితో ఆగకుండా, “నేను చేయట్లేదు.. నువ్వు కూడా డ్యాన్స్ చేయడానికి వీల్లేదు” అంటూ వధువుపై అందరి ముందే గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్చరించాడు.

Markapuram Marriage Dispute: ఆలోచనలో పడ్డ తండ్రి.. స్పాట్ లోనే పెళ్లి రద్దు

అందరి ముందు పెళ్లికూతురిపై వరుడు ఆగ్రహం వ్యక్తం చేయడం పక్కనే ఉన్న వధువు తండ్రికి తీవ్ర మనస్తాపాన్ని కల్పించింది. “పెళ్లి కాకముందే, అందరి సమక్షంలోనే తన కూతురిపై ఇంతలా పెత్తనం చలాయిస్తూ అరుస్తున్నాడంటే.. ఇక పెళ్లయ్యాక అత్తారింట్లో నా కూతురి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో” అని ఆయన ఆలోచనలో పడ్డారు. వెంటనే తీవ్ర నిర్ణయం తీసుకున్న వధువు తండ్రి.. ఊరేగింపు వాహనం నుంచి తన కుమార్తెను కిందికి దించేశారు. ఈ పెళ్లి మాకు వద్దంటూ అక్కడికక్కడే తేల్చిచెప్పారు. రాత్రికి రాత్రే సామాన్లతో సహా బంధువులందరినీ తీసుకుని తమ సొంత గ్రామమైన తురిమెళ్లకు తిరిగి వెళ్లిపోయారు.

పెళ్లి ఆగిపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని అప్పటికప్పుడు కట్నకానుకలు, ఇతర లావాదేవీలకు సంబంధించిన నష్టపరిహారాన్ని ఇచ్చిపుచ్చుకుని సెటిల్ చేసుకున్నారు. అయితే, అప్పటికే పెళ్లి ఏర్పాట్ల కోసం తాము భారీగా డబ్బు ఖర్చు చేశామని, చిన్న కారణానికే పెళ్లి ఆపేయడం ఏంటని వరుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా, అహంకారానికి పోయి చేసుకున్న చిన్న వివాదం ఒక ఇంట జరగాల్సిన శుభకార్యాన్ని అర్ధాంతరంగా నిలిపివేసింది.

కొరియా టూర్‌లో నారా లోకేష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha