Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Uttar Pradesh: ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

Uttar Pradesh: ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

వార్త 4 months ago

సోషల్ మీడియా రీల్స్ కోసం యువత చేసే ప్రమాదకర ప్రయోగాలు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగిన ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది.

సరదాగా వీడియో చిత్రీకరించాలనుకున్న ఓ మహిళ అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయింది.

ఉరి సన్నివేశం చిత్రీకరణలో దుర్ఘటన

బాందా జిల్లాకు(Uttar Pradesh) చెందిన 27 ఏళ్ల మోహిని అనే మహిళ ఇంట్లో ఉరి వేసుకున్నట్లు నటిస్తూ వీడియో తీసేందుకు ప్రయత్నించింది. మెడకు తాడు బిగించి స్టూల్‌పై నిలబడి మొబైల్‌లో రికార్డింగ్ ప్రారంభించింది. అయితే చిత్రీకరణ సమయంలో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి స్టూల్ జారిపోవడంతో, మెడకు బిగిసిన తాడు ప్రాణాంతకంగా మారింది.

కుమార్తె గుర్తించిన ఘటన

ఈ దుర్ఘటనను ముందుగా ఆమె నాలుగేళ్ల కుమార్తె గుర్తించింది. గదిలోకి వచ్చి తల్లి వేలాడుతూ కనిపించడంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha