Heavy Rain : ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగానూ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని సూచించింది. పశ్చిమబెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్పపీడన కేంద్రం నుంచి ఆగ్నేయ దిశగా రుతుపవన ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
Read Also: IPS Trainee Uday Krishna:నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
Heavy Rain
Heavy Rain : తెలంగాణలో వాయుగుండం ప్రభావం తక్కువే
రాబోయే 24 గంటల్లోపు కొంచెం వేగాన్ని పుంజుకుని ఝార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ ఇంకా ఉత్తర ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే తెలంగాణలో వాయుగుండం ప్రభావం తక్కువే అయినా అరేబియన్లో ఒక ఆవర్తనం ఉందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంకో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురిస్తే సగటు వానలకు దగ్గర అయ్యే అవకాశం ఉందన్నారు. మైనస్ 24, మైనస్ 25 వరకు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఆదివారం గణాంకాలతో పోల్చితే మైనస్ 27 శాతం మాత్రమేనని, ఈ శాతం వర్షాలు వర్షపాతం లోటును పూడ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా మెదక్ జిల్లాలో సోమవారం 6.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

