Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వామపక్షాలు కనుమరుగు!

వామపక్షాలు కనుమరుగు!

వార్త 3 weeks ago

Leftists : దేశంలో వామపక్ష రాజకీయాలకు తుది ఆశలు అడియాసలయ్యాయి. ఒకప్పుడు 1980 దశ కంలో త్రిపుర, పశ్చిమబెంగాల్, కేరళం రాష్ట్రాల లో వామపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలే బలంగా ఉండేవి.

అంటే అక్కడి ప్రజానీకం వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులై ఈ దేశంలో ఏ వర్గానికైనా మంచి జరి గితే వారి ద్వారానే జరుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఉండేవారు. కానీ రానురాను ఆ పార్టీ పాలనపై ఉన్న నమ్మకాలు సడలిపోయాయి. వామపక్ష ఉద్యమాలలో అత్యధికులు పాల్గొనడం మానేసారు.
మొదట్లో ఎలా ఉన్నా వారిలో కూడా రాజకీయ ఆకాంక్షలు పెచ్చుపెరిగి, ఇతరత్రా పుట్టిన ప్రజాకర్షక పార్టీలలో జతకట్టి ఎలాగైనా చట్టసభలకు వెళ్లాలనే తాపత్రయం పెరిగింది. ఆయా పార్టీల ఆలోచనలు, మారుతున్న స్వభావాల రీత్యా వామ పక్ష భావజాలానికి ఆ పార్టీ కార్యకర్తలే దూరమయిన పరిస్థితులున్నాయి. అంతేకాదు రైట్ పార్టీల సాంగత్యం లో లెఫ్ట్ పార్టీ కార్యకర్తల ఆలోచనలు కూడా మారిపో యాయి. ఎన్నికల్లో ఏ ఇతర రైట్ పార్టీలతో జతకట్టాల్సి వచ్చినా రాజకీయ సీట్ల బేరసారాలతో ‘పొత్తులు’కలి సేవి. లేకుంటే ఎవరికి వారే యమునా తీరేగా ఉండిపోయేవి.

Read Also: West Bengal Elections: సీఎంగా మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

 Leftists

Leftists : సుదీర్ఘకాలం పాలన

రాజకీయ పొత్తుల చర్చల నేపథ్యంలోనే వారి మధ్య సైద్ధాంతిక విబేధాలను పక్కన బెట్టి సీట్లు’ అంకెల (పాతిపదికగా మమేకమవడంతో ప్రజల్లో వామపక్షాల పట్ల నిరాసక్తత బయలుదేరింది. పశ్చిమబెంగాల్లో శ్రామిక వర్గ విస్తృత ప్రయోజనాలు కాపాడే పార్టీగా వర్ధిల్లిన కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య అనంతరం అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో మమతా బెనర్జీ దూకుడుకు వామపక్ష ప్రభుత్వం నేల కూలింది. ఆ తర్వాత గత 15 ఏళ్లుగా చెప్పుకోదగిన స్థానాలు దక్కించుకోలేకపోయింది. బెంగాల్ లో సిపిఎం 33 ఏళ్లపాటు రాజ్యాధికారంలో ఉంది. తాజా ఎన్నికలలో 27 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 2స్థానాలకే వామపక్ష పార్టీలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. త్రిపురలో వామపక్ష ప్రభుత్వాలు సుదీర్ఘకాలం పాలన చేశాయి. 1993 నుంచి 2018 వరకు పాతికేండ్ల ఆ రాష్ట్రాన్ని వామపక్షాలు పాలించాయి. 20ఏళ్ల పాటు మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో బిజెపి త్రిపురలో ప్రభుత్వ మార్పును ఆహ్వా నించే స్థాయిలో కృషి చేసి పాలనాపగ్గాలు తీసుకుంది. దేశంలో ఎక్కడైనా వామపక్ష పాలనను మార్చగలమన్న ధోరణికి ఆ ఎన్నికల్లోనే అంకురార్పణ జరిగింది. ఆ తర్వాతనే బిజెపి ప్రతిరాష్ట్రంలోనూ తమ ప్రభుత్వమే ఉండాలని వ్యూహాలు పన్నింది.

నమ్మకాల ను పక్కన బెట్టడం

కేరళంలో లెఫ్ట్ ప్రభుత్వం (ఎల్డీఎఫ్) నేటివరకు పదేళ్లు పరిపాలించింది. తాజా ఎన్నికలలో ఎల్డీఎఫ్కు పరాభవం ఎదురైంది. కేరళలో వామపక్ష కూటమి ఓటమితో దేశంలో అధికారంలో ఉన్న ఒక్కగానొక్క రాష్ట్రం కూడా కోల్పోయింది. ఐదు దశాబ్దాల వామపక్ష చరిత్రలో గెలిచిన స్థానాలు తగ్గిపోతూ వస్తు న్నాయి. 140 స్థానాలున్న కేరళంలో సిపిఐ(ఎం) నేతృ త్వంలోని ఎల్డీఎఫ్ 35 స్థానాల్లో
మాత్రమే విజయం సాధించింది. యుడిఎఫ్ వేవ్లో 13 మంది కేబినెట్ మంత్రులు ఓడిపోయారు. కేరళలో వామపక్ష కూటమి ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా జనం ఓటు వేసారనే ప్రస్తావనలున్నాయి. 1977 తరువాత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో లేకపోవడం ఇదే ప్రథమం. కేరళలో ప్రతి ఐదేండ్లకోసారి ఎల్డీఎఫ్, యుడిఎఫ్ ప్రభుత్వాలను మార్చుకుంటుంటాయి. కానీ గతఎన్ని కలో అలాంటిదేమీ జరుగలేదు. వరుసగా రెండోసారి గెలిచింది. ఈసారి మాత్రం హ్యాట్రిక్ కొట్టే అవకాశం కోల్పోయింది. గత ఎన్నికల తర్వాత కేరళలో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోతున్నా సిఎం పినరయి విజయన్ పట్టించుకోలేదు. పైగా శబరిమల మహిళా భక్తులు ప్రవేశం వంటి అంశాల్లో పాత సంప్రదాయాలను నమ్మకాల ను పక్కన బెట్టడంతో బెంగాల్లో మార్క్సిస్టులకు చుక్కె దురైంది.

 Leftists

కమ్యూనిస్టుపాలనకు చరమ గీతం

ప్రపంచంలోనే ప్రజాస్వామిక ఎన్నికల ద్వారా 1957లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షా లు తొలిసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన విషయం విదితమే. అంతకు ముందే 1951-52లో మొదటి లోక్సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అధిక స్థానాలు కైవసం చేసుకున్నాయి. అప్పట్నించి ఎన్ని ఎన్ని కలు వచ్చినా ప్రజల కోసమే తామున్నట్లు భరోసా ఉండేది. ప్రాంతీయ పార్టీల రాకతో వాటితో మమేకమై కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రాభవం కోల్పోయామన్న అభిప్రాయాలు ప్రజాబాహుళ్యం నుంచి వినిపిస్తుంటాయి. వామపక్ష పార్టీలు ఎంతో బలంగా ఉద్యమాలు రూపొం దించి ప్రజాప్రయోజనాల కోసం పాటుపడ్డారన్నపేరున్నా రెండు మూడు ప్రధానసందర్భాల్లో తమ రాజకీయ తప్పిదాలను ఒప్పుకున్నాయి. 1996లో ప్రధాని పదవికి పార్టీ అగ్రనేత జ్యోతిబసు పేరు ప్రతిపాదనకొచ్చినా పార్టీ పొలిట్ బ్యూరో వ్యతిరేకించింది. ఆ నిర్ణయం తమ చారి త్రిక తప్పిదంగా ఒప్పుకుంది. అంతకుముందు ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో అత్యయిక స్థితి అంశంపై కొన్ని వామపక్షాలు బలపరిచాయి. ఆ తర్వాత తమ చారిత్రక తప్పిదంగా అంగీకరించాయి. ఇలాంటి అంశాల నేపథ్యంలో వామపక్ష భావన ప్రజలకు మధ్య అంతరం మొదలైంది. 2014లో దేశవ్యాప్తంగా కాషాయి అనుకూల పవనాలకే త్రిపురలో కమ్యూనిస్టుపాలనకు చరమ గీతం పాడారని భావన. కానీ నేటి కేరళం వామపక్ష రాజ కీయాలు మాత్రం అవినీతి ముసుగులో కొట్టుకుపోయి నట్లు భావించాలి. అలా పశ్చిమబెంగాల్, త్రిపురలలో వామపక్ష భావనలకు తిలోదకాలిచ్చి ఆ పార్టీ వెలవెల బోయే స్థాయికి తెచ్చారన్నది రాజకీయ భావన.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha