Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు.. వీడియో చూశారా?

సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు.. వీడియో చూశారా?

వార్త 2 months ago

Sachin Tendulkar Birthday: ముంబైలోని తన నివాసం వెలుపల అభిమానుల సమక్షంలో సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. గిరిజన ప్రాంత పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్, తన కోసం వేచి ఉన్న అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసారు..

Read Also: IND W vs SA W: హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్.. కానీ టీమిండియాకు తప్పని ఓటమి

Sachin Tendulkar Birthday: అభిమానుల కోలాహలం

సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆయన నివాసం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చారు.అభిమానులు తీసుకొచ్చిన ప్రత్యేక కేక్‌ను సచిన్ వారి మధ్యలో కట్ చేశారు. "హ్యాపీ బర్త్‌డే సచిన్" అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.తన ఇంటి వద్ద వేచి ఉన్న అభిమానులను చూసి సచిన్ బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు.

ఛత్తీస్‌గఢ్ పర్యటన ముగించుకుని..

రెండు రోజుల క్రితమే ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో గిరిజన పిల్లలతో కలిసి సమయం గడిపిన సచిన్, తిరిగి ముంబై చేరుకుని తన నివాసం వద్ద ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అటు సేవా కార్యక్రమాలు, ఇటు అభిమానులతో పలకరింపులతో సచిన్ 53వ పుట్టినరోజు అత్యంత ప్రత్యేకంగా నిలిచింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రాహా 'నటి' కాకూడదు.. అథ్లెట్ కావాలి: అలియా భట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha