Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"వార్ వన్ సైడ్ అనుకున్నా.. కానీ" బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

"వార్ వన్ సైడ్ అనుకున్నా.. కానీ" బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

వార్త 1 week ago

Jasprit Bumrah: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో సారథ్య బాధ్యతలు చేపట్టిన జస్‌ప్రీత్ బుమ్రా, జట్టును విజయపథంలో నడిపించారు.విజయం అనంతరం బుమ్రా మాట్లాడుతూ..

“ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.

Read Also:Tilak Varma: "మ్యాచ్ ఫినిషింగ్ అంటే నాకు ఇష్టం": తిలక్ వర్మ

ఈ గెలుపు క్రెడిట్ అంతా తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్లకే దక్కుతుంది. తిలక్ వర్మ ఒత్తిడిలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను ముగించాడు. శార్దూల్ బౌలింగ్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది” అని కొనియాడారు. విల్ జాక్స్ ప్రదర్శనను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

 Jasprit Bumrah MI Captain

Jasprit Bumrah: పిచ్ పరిస్థితిపై అంచనా

ధర్మశాల వికెట్ గురించి వివరిస్తూ.. “గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈ పిచ్ కొంచెం పొడిగా ఉంది. బంతి ఆగుతూ, తక్కువ ఎత్తులో రావడాన్ని గమనించి మా ప్లాన్స్ మార్చుకున్నాం. పేస్ తగ్గించి, క్రాస్ సీమ్‌తో స్టంప్స్‌ను టార్గెట్ చేయాలని బౌలర్లకు సూచించాను. బౌలర్లందరూ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు” అని బుమ్రా తెలిపారు. చివర్లో కొన్ని క్యాచ్‌లు చేజార్చడం కొంత ఇబ్బంది కలిగించినా, అంతిమంగా విజయం సాధించడం సంతృప్తినిచ్చిందని అన్నారు.

తన కెప్టెన్సీ అనుభవంపై బుమ్రా సరదాగా స్పందించారు. “నేను ఇప్పటికే టెస్టులు, టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించాను. ఇప్పుడు ముంబైకి కూడా సారథ్యం వహించాను. ఇక మిగిలింది వన్డే క్రికెట్ మాత్రమే.. కానీ అది జరుగుతుందని నేను అనుకోవడం లేదు (నవ్వుతూ). జోకులు పక్కన పెడితే, ఈ గొప్ప మైదానంలో కెప్టెన్సీని నేను బాగా ఆస్వాదించాను” అని చెప్పుకొచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

యోగరాజ్ సింగ్‌పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha