Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యోగరాజ్ సింగ్‌పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?

యోగరాజ్ సింగ్‌పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?

వార్త 3 months ago

Yograj Singh: టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

మహిళలను కించపరిచేలా, అగౌరవంగా మాట్లాడినందుకు చండీగఢ్ పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Read Also:Tilak Varma: "మ్యాచ్ ఫినిషింగ్ అంటే నాకు ఇష్టం": తిలక్ వర్మ

వివాదం నేపథ్యం: వెబ్ సిరీస్ వీడియో వైరల్

ఇటీవల సోషల్ మీడియాలో ‘లుక్కే’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయ్యింది. అందులో ఒక పోలీస్ స్టేషన్ సీన్‌లో యోగరాజ్ సింగ్ పాత్ర.. మహిళలను ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన, కించపరిచే పదజాలాన్ని (Explicit and Derogatory remarks) ఉపయోగించింది. ఈ క్లిప్ చూసిన నెటిజన్లు, మహిళా సంఘాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

 Yograj Singh Case Chandigarh

Yograj Singh: మహిళా కమిషన్ సీరియస్.. ఎఫ్ఐఆర్ నమోదు

ఈ వ్యవహారం పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో అధికారులు వెంటనే స్పందించారు. కమిషన్ చైర్‌పర్సన్ రాజ్ కౌర్ గిల్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, యోగరాజ్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సిఫార్సు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 79, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 62A కింద కేసులు నమోదు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: శ్రేయస్ అయ్యర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha