Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. HDFC నిర్ణయం..

వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. HDFC నిర్ణయం..

వార్త 3 months ago

HDFC Bank: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తన ఉద్యోగులకు, అంతర్జాతీయంగా నెలకొన్న ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు కార్పొరేట్ సంస్థలు 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు.

ప్రధాని అందించిన ఈ పొదుపు మంత్రానికి సానుకూలంగా స్పందిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ వినూత్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు అడుగులు వేసింది.

Read Also : Telangana liquor prices: తెలంగాణ మందుబాబులకు షాక్.. జూన్ 2 నుండి మద్యం ధరల పెంపు?

 Work from home two days a week.. HDFC decision

HDFC Bank: వారంలో రెండు రోజులు ఇంటి నుంచే పని

బ్యాంకులో కస్టమర్లతో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్లు బ్యాంకు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఈ విధానాన్ని మొదటగా నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని, ఉద్యోగుల పనితీరు, సేవల నాణ్యతను బట్టి దీనిని భవిష్యత్తులో శాశ్వతంగా కొనసాగించాలా లేదా అనే తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకు తెలిపింది.

ఏ ఏ విభాగాలకు ఈ సదుపాయం?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోని అంతర్గత కార్యకలాపాలు నిర్వహించే కొన్ని నిర్దిష్ట విభాగాల ఉద్యోగులకు మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ట్రెజరీ ఆపరేషన్స్, అంతర్గత బ్యాంకు లావాదేవీల విభాగం, డిజిటల్ బ్యాంకింగ్,హెచ్ఆర్ డిపార్టుమెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. బ్రాంచ్‌లకు వచ్చే కస్టమర్లతో నేరుగా ముఖాముఖి సంబంధాలు కలిగి ఉండే ఫ్రంట్ ఆఫీస్, క్యాష్ కౌంటర్ వంటి విభాగాల ఉద్యోగులకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం వర్తించదని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కొందరు ఉద్యోగులు ఇంటి నుండి పనిచేసినప్పటికీ, అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాల కారణంగా సామాన్య వినియోగదారులకు బ్యాంకు సేవల పరంగా ఎలాంటి చిన్న సమస్య కూడా కలగబోదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెట్రోల్ ధరల సెగ: ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ప్రభావం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha