Varanasi Update: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ 'వారణాసి' (SSMB29) షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
అయితే, వర్క్ విషయంలో అస్సలు రాజీ పడని మన ‘జక్కన్న’, తన టీమ్ ఆరోగ్యం కోసం ఒక సర్ప్రైజ్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also:Raaka : అల్లు అర్జున్ 'రాకా' అప్పుడేనా ?
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో మహేష్ బాబుపై ఒక పవర్‌ఫుల్ సాంగ్ షూట్ జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం.
Varanasi Update:జక్కన్న మనసు మారింది!
షూటింగ్ విషయంలో అత్యంత కఠినంగా ఉండే రాజమౌళి, ఈసారి తన టీమ్ కోసం మెత్తబడ్డారు.ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగానే మే నెల మొత్తం షూటింగ్‌కు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించారు.వేసవి ఎండలు, భానుడి భగభగల వల్ల నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. .షూటింగ్‌కు విశ్రాంతినిచ్చినా, రాజమౌళి మాత్రం ఖాళీగా ఉండబోరు. ఈ గ్యాప్‌లో వీఎఫ్ఎక్స్ (VFX), గ్రాఫిక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆయన పర్యవేక్షించనున్నారు.
Varanasi Movie Latest Update
విడుదలకు ముహూర్తం ఖరారు?
ఏప్రిల్ 7, 2027న (శ్రీరామనవమి సందర్భంగా) ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. మహేష్ బాబును సరికొత్త విశ్వరూపంలో చూపించబోతున్న 'వారణాసి' మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో సుమారు రూ. 1400 కోట్లకు పైగా వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘వారణాసి’ ఒక గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రమని, కథాంశం క్రీస్తు శకం 512 నుంచి భవిష్యత్తులోని 2027 వరకు సాగుతుందని తెలుస్తోంది. సోషియో-ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను హనుమంతుడి లక్షణాల స్ఫూర్తితో రాజమౌళి డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

