Rini Sampath: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి మహిళ రిని సంపత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో నిలిచిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు.
2026 మేయర్ ఎన్నికల ప్రైమరీ బ్యాలెట్‌లో చోటు దక్కించుకోవడానికి అవసరమైన అర్హతను సాధించినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.
Read Also:Indian Ocean Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం!
Rini Sampath: చరిత్ర సృష్టించిన రిని సంపత్
తమిళనాడులోని తేనిలో జన్మించిన రిని సంపత్, ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న ఆమె, వాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా నిలిచారు.మేయర్ అభ్యర్థిగా బ్యాలెట్‌లో చోటు దక్కించుకోవడానికి అవసరమైన 4,500 మందికి పైగా ప్రజల సంతకాలను ఆమె సేకరించారు.యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC)లో స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిగా, 'థారోస్' సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆమె ఎన్నికల ప్రచారం ప్రధానంగా 'మౌలిక సదుపాయాల పరిష్కారం' (Fix the Basics) అనే అంశం చుట్టూ సాగుతోంది. తాను రాజకీయ నాయకురాలిని కాదని, ఏ ప్రత్యేక ప్రయోజన గ్రూపులకూ లొంగిపోనని ఆమె స్పష్టం చేశారు. నగరంలో గుంతలు లేని రోడ్లు వేయడం, పొటోమాక్ నదిలో వ్యర్థాల కలయికను ఆపడం, పెరిగిన ధరలను తగ్గించడం మరియు అత్యవసర సేవలైన 911 వెయిటింగ్ టైమ్‌ను తగ్గించడం వంటి కనీస అవసరాలపైనే తాను దృష్టి పెడతానని ఆమె వాగ్దానం చేస్తున్నారు. కొత్త డీసీని నిర్మించడమే తన లక్ష్యమని ఆమె ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
Rini Sampath Washington DC Mayor Candidate
ఈ మేయర్ ఎన్నికల్లో రిని సంపత్‌తో పాటు జనీస్ లూయిస్ జార్జ్, కెన్యాన్ మెక్‌డఫీ, గ్యారీ గుడ్‌వెదర్, రాబర్ట్ ఎల్ గ్రాస్ మరియు రోండా హామిల్టన్ వంటి ఇతర అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ఒక అవుట్‌సైడర్‌గా రంగంలోకి దిగి, నగర సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని తహతహలాడుతున్న రిని సంపత్, ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దక్షిణాసియా నుంచి ఈ స్థాయి పోటీకి వెళ్లిన తొలి మహిళగా ఆమె ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.
తేని నుంచి వాషింగ్టన్ వరకు.. రిని సంపత్ అద్భుత రాజకీయ ప్రస్థానం!
రినీ సంపత్ .. తేనిలో జన్మించారు. ఏడేళ్ల వయసులో ఆమె ఆమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె వయసు 31 ఏళ్లు. ఓ దశాబ్ధ కాలం పాటు ఆమె వాషింగ్టన్ డీసీలో ఉన్నారు. ప్రొఫెషనల్‌గా ఆమె ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సైబర్ సెక్యూర్టీ ప్రొఫెషనల్ కూడా. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఆమె చదువుకున్నది. 2015లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఆమె జాతీయ దృష్టిని ఆకర్షించారు. యూఎస్సీలో ఉన్న సమయంలో.. విద్యార్థుల హక్కులు, స్వేచ్ఛ గురించి క్యాంపులు ఆర్గనైజ్ చేశారు. వర్ణ వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.రాజకీయంగా ఆమె డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2026 వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో ఉన్నారు. 1975 నుంచి ఇప్పటి వరకు వాషింగ్టన్ డీసీలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కొనసాగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
యుద్ధ విమానం కూలినా పైలట్ క్షేమం.. అమెరికా రక్షణ దళాల చారిత్రక విజయం

