Southwest Monsoon Updates: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) తీపి కబురు అందించింది. ఈ ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో మండిపోతుండటంతో, వర్షాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాల కదలికపై కీలక అప్‌డేట్ ఇచ్చింది.
Read Also : Electric vehicles: రాబోయే కాలం విద్యుత్ వాహనాలదే!
Southwest monsoon to hit Andaman and Nicobar Islands.. IMD report
Southwest Monsoon Updates: మే 16న అండమాన్‌లోకి ప్రవేశం
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయి. రుతుపవనాల కదలికకు వాతావరణం ప్రస్తుతం ఎంతో అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. మే 16 న అండమాన్ నికోబార్ దీవులకు చేరుకునే అవకాశం ఉంది. మే 13 నుంచి 19 వరకు అండమాన్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్ర మట్టానికి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు తుపాను వలయం విస్తరించి ఉంది. రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది.
ఎండల తీవ్రత నుంచి విముక్తి ఎప్పుడు?
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. అక్కడక్కడా అకాల వర్షాలు కురిసినప్పటికీ, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. రుతుపవనాలు అండమాన్‌ను తాకిన తర్వాత, క్రమంగా కేరళ మీదుగా భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల జూన్ మొదటి వారం నాటికి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత తగ్గి, వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అండమాన్ దీవుల్లో నెలకొన్న వాతావరణ మార్పులు రుతుపవనాల రాకకు స్పష్టమైన సంకేతాలని ఇస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
తమిళనాడులో 717 మద్యం షాపుల మూసివేత.. 21 ఏళ్ల లోపు వారికి నో లిక్కర్..

