Electric vehicles: ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో వినిపిస్తున్న ఒకే ఒక నినాదం.. 'గో గ్రీన్' పెట్రోల్ బంకుల వద్ద పెరు గుతున్న క్యూలైన్లు, ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలు, వీటికి తోడు పర్యావరణ స్పృహ వెరసి సామాన్యుడి చూపు ఇప్పుడు 'ఎలక్ట్రిక్ వాహనం' వైపు మళ్లింది.
నిన్నటి వరకు విలాసంగా చూసిన ఈవీలు, నేడు అవసరంగా మారి రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. భారత ఈవీ మార్కెట్ ప్రస్తుత గణాంకాలు చూస్తే, భవిష్యత్తులో ప్రగతి పథంలో పయనం ఖాయం అనిపిస్తుంది. భారత దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం ఒక ‘నిశ్శబ్ద విప్లవం’లా మొదలై, ఇప్పుడు సునామీలా మారుతోంది. 2025 నాటికి భారత్లో ఈవీ అమ్మకాలు 23 లక్షల మార్కును దాటడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ద్విచక్ర వాహనాల హవా నడుస్తుంది. ఈవీ విప్లవంలో సింహభాగం టూవీలర్లదే. 2030 నాటికి దేశంలో అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాల్లో 80 శాతం వాటా ఈవీలదే ఉంటుందని నిపు ణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు కేవలం 20నుండి 30 పైసలకే పడిపోవడమే దీనికి ప్రధాన కారణం.
Read Also: Oil Crisis: ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం 'స్పెషల్ ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్'!
Electric vehicles
Electric vehicles: ఈవీ రంగం వైపు దేశాలు పరుగులు
2023తో పోలిస్తే 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఈవీ రిజిస్ట్రేషన్లు దాదాపు 40-50 శాతం వార్షిక వృద్ధిని కనబరిచాయి. కేవలందగరాలకే పరిమితం కాకుండా, టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో కూడా ఛార్జింగ్ పాయింట్లు వెలుస్తుండటంతో అమ్మకాలు పుంజు కున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కొత్తగా వస్తున్న పీఎం వంటి పథకాలు తయారీదారులకు, కొనుగోలుదారు లకు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. దీనివల్ల పెట్రోల్ వాహనాలకు, ఈవీలకు మధ్య ఉన్న ధరవ్యత్యాసం క్రమం గా తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజ కీయ పరిస్థితులు ఈవీ రంగం వైపు దేశాలు పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్వాదం, మధ్య ప్రాచ్యంలో నెలకొన్న అశాంతి వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలుఅస్థిరంగా మారుతున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ. ఈ ‘ఎనర్జీ సెక్యూరిటీ’ ముప్పు నుంచి బయటపడాలంటే విద్యుత్ వాహనాలే ఏకైక ప్రత్యామ్నాయం. 2070 నాటికి కర్బన ఉద్గారాలను కున్నాకు తగ్గించాలన్న భారత్ లక్ష్యానికి ఈవీలు వెన్నెముకగా నిలుస్తున్నాయి. యూరప్, చైనా దేశాలు ఇప్పటికే పెట్రోల్/డీజిల్ వాహనాల అమ్మ కాలను నిలిపివేసే ప్రకటించాయి.
ఊహించని మార్పు
ప్రపంచ వ్యాప్తంగా లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి పెరగడం తో, గత దశాబ్ద కాలంలో బ్యాటరీ ధరలు దాదాపు 85 తగ్గాయి. ఇది వావాన ధరలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుతు న్నప్పటికీ, ఈ రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘ఛార్జింగ్ స్టేషన్ల కొరత. క్యాటరీ ఎక్కడ అయిపోతుందో అన్న భయం వినియోగదారులను ఇంకా వెంటాడుతోంది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం, ప్రతి 2030 వాహ నాలకు ఒక పబ్లిక్ర్జింగ్ పాయింట్ కూడా అందుబాటు లో లేదు. పెట్రోల్ కొట్టించడానికి పట్టే 2 నిమిషాలతో పోలిస్తే, ఈవీ ఛార్జింగ్కు పట్టే సమయం (30 నిమిషాల నుండి 4 గంటలరకు) ఇంకా ఎక్కువే. దీనిని అధిగమిం చడానికి ‘బ్యాటరీ స్వాపింగ్’ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్స హిస్తోంది. లక్షలాది వాహనాలు ఒకేసారి ఛార్జింగ్ పెట్టిన ప్పుడు విద్యుత్డ్పై పడే భారాన్ని తట్టుకునేలా మన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సి ఉంది. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు సమాధానంగా రాబోయే ఐదేళ్లలో ఈవీ రంగం ఊహించని మార్పులకు లోనవుతుం ది.
పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా ఈవీ బాట పట్టక తప్పదు
కొన్ని దిగ్గజాలు బ్యాటరీ తయారీలో స్వయం సమృద్ధి సాధిస్తే, రూ. 5లక్షల నుండి 8లక్షల లోపే నాణ్యమైన ఈవీ కార్లు వచ్చే అవకాశం ఉంది. కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా, భారీ ట్రక్కులు మరియు బస్సుల కోసం ‘గ్రీన్ హైడ్రోజన్’ ఇంధనం కూడా తోడవుతుంది. కిరాణా షాపుల వద్ద, పెట్రోల్ బంకుల్లో, అపార్ట్మెంట్ పార్కింగ్లలో విరివిగా ‘ఫాస్ట్ ఛార్జర్లు’ అందుబాటులోకి వస్తాయి. పెట్రోల్ ధరలు సెగ నుంచి తప్పించుకోవాలన్నా, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా మనం ఈవీ బాట పట్టక తప్పదు. సవాళ్లను అధిగమిస్తూ, సాంకేతికతను అందిపుచ్చుకుంటే.. 2030 నాటికి భారత వీధులన్నీ శబ్దం లేని, కాలుష్యం లేని ‘విద్యుత్ వాహనాల’తో కళకళలాడటం ఖాయం! బ్యా టరీ రీసైక్లింగ్ స్టార్టప్లు మన దేశంలో కొత్త ఉపాధి అవకా శాలను సృష్టిస్తున్నాయి. ఒక ఈవీ వాహనం తన జీవిత కాలంలో సాధారణ పెట్రోల్ వాహనం కంటే 50 శాతం తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది.
Electric vehicles
ఖర్చు దాదాపు శూన్యం
ప్రస్తుత తరుణంలో ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం) కేవలం ఒక ప్రత్యా మ్నాయం మాత్రమే కాదు, అది కాలం తెచ్చిన అనివార్య మైన ఆవశ్యకత. అస్థిరమైన అంతర్జాతీయ రాజకీయాలు, నిరంతరం మండుతున్న ఇంధన ధరల మధ్య సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే విద్యుత్ వాహనమే శరణ్యం. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచిచూసే అవసరం లేకుండా, ఇంట్లోనే స్మార్ట్ఫోన్లా గా వాహనాన్ని ఛార్జ్ చేసుకునే సౌలభ్యం ఒక గొప్ప విముక్తిని ఇస్తుంది. భావోద్వేగ పరంగా చూస్తే, మనం మన తరువాతి తరానికి స్వచ్చమైన గాలిని, కాలుష్య రహిత వాతావరణాన్ని కానుకగా ఇవ్వాలి. ఈవీ వాహనం నడుపుతున్నప్పుడు వచ్చే ఆ నిశ్శబ్దం, మనం పర్యావరణానికి చేస్తున్న మేలును గుర్తు చేస్తూ ఒక రకమైన మానసిక తృప్తిని ఇస్తుంది. సాంకేతికం గా చూసినా, తక్కువ కదిలే భాగాలు ఉండటంవల్ల మెయిం టెనెన్స్ ఖర్చు దాదాపు శూన్యం. మౌలిక సదుపాయాలు ఛార్జింగ్ స్టేషన్లు వేగంగావిస్తరిస్తున్న నేటి పరిస్థితుల్లో, తెలివైన బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈవీని ఎంచుకోవ డమే అన్ని విధాలా మేలైన నిర్ణయం. రాబోయే కాలం విద్యుత్ వాహనాలదే, అందుకే ఈవీయే మేటి!
-డా. చిట్యాల రవీందర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

