Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు

వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు

వార్త 3 weeks ago

WhatsApp New Security Features: వాట్సాప్ వినియోగదారుల ఖాతాల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్ మోసాలు, అనధికారికంగా ఖాతాల్లోకి చొరబడే ప్రయత్నాలను అడ్డుకోవడంతో పాటు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని మరింత సురక్షితంగా ఉంచేలా ఈ తాజా అప్‌డేట్‌లను రూపొందించింది.

దీంతో వాట్సాప్ వినియోగదారులకు భద్రత విషయంలో మరింత రక్షణ లభించనుంది.

మల్టిపుల్ పాస్కీల సదుపాయం

వాట్సాప్‌లో ఖాతా భద్రత కోసం అందుబాటులో ఉన్న పాస్కీ ఫీచర్‌ను ఇప్పటికే 100 కోట్లకు పైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ లేదా ఫోన్ స్క్రీన్ లాక్ ద్వారా సులభంగా లాగిన్ అయ్యే ఈ ఫీచర్‌కు తాజాగా మరో సదుపాయాన్ని జోడించింది. ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల్లో ఒకే వాట్సాప్ ఖాతాను ఉపయోగించే వారు ప్రతి పరికరానికి ప్రత్యేకంగా వేర్వేరు పాస్కీలను జోడించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఖాతా భద్రత మరింత మెరుగుపడనుంది.

Read Also : D-Martలో సరకులు కొంటున్నారా? అయితే బిల్లు చూసుకోకపోతే..మీ జేబుకు చిల్లు పడ్డట్లే !

 New security features on WhatsApp

WhatsApp New Security Features: టూ-స్టెప్ వెరిఫికేషన్‌లో పూర్తి పాస్‌వర్డ్

ఇప్పటివరకు టూ-స్టెప్ వెరిఫికేషన్ కోసం కేవలం ఆరు అంకెల పిన్ (PIN) మాత్రమే పెట్టుకునే వెసులుబాటు ఉండేది.

  • కొత్త అప్‌డేట్: వినియోగదారులు అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులు (Special characters) మిళితం చేసిన పొడవైన, బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల అకౌంట్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి.

గుర్తుతెలియని కాల్స్‌కు ‘కాల్ స్క్రీనింగ్’

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మోసపూరిత కాల్స్ అడ్డుకునేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

  • అదనపు వివరాలు: అపరిచిత నంబర్ల నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్ ఏ దేశానికి చెందింది? ప్రయాణికుడికి ఆ వ్యక్తితో ఏవైనా కామన్ గ్రూప్‌లు ఉన్నాయా? వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • ఉపయోగం: ఈ వివరాల ఆధారంగా స్పందించి కాల్ ఎత్తాలా వద్దా లేదా నంబర్‌ను బ్లాక్ చేయాలా అనేది వినియోగదారులు సులభంగా నిర్ణయించుకోవచ్చు.

'రాఖీ' మార్కెట్.. రూ.30వేల కోట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha