Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. ఫలితాలను తెలుసుకోవడానికి ఇకపై ఎటువంటి వెబ్ పోర్టల్ లాగిన్ లేదా మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
నేరుగా వాట్సాప్ (WhatsApp) ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునే సరికొత్త వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
Read Also:Indian Bank Recruitment: ఇండియన్ బ్యాంక్‌లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఫలితాలు పొందే విధానం
Inter results on WhatsApp.. This is the number!
విద్యార్థులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 8096958096 నంబర్‌కు ‘హాయ్’ (Hi) అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది. అనంతరం మెనూలో ‘BIE Exam Result’ అని టైప్ చేసి, హాల్ టికెట్ నంబర్, సంవత్సరం, స్ట్రీమ్ (జనరల్/ఒకేషనల్) వివరాలు అందిస్తే చాలు. విద్యార్థి ఫలితం తక్షణమే వాట్సాప్ మెసేజ్ రూపంలో అందుతుంది.
Telangana Inter Results: హాల్ టికెట్ల తరహాలోనే..
గతంలో ఇంటర్ హాల్ టికెట్లను కూడా ప్రభుత్వం ఇదే వాట్సాప్ విధానం ద్వారా పంపిణీ చేసింది. ఆ పద్ధతి విజయవంతం కావడంతో, ఫలితాల ప్రక్రియను కూడా సులభతరం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా, సర్వర్ లోడింగ్ సమస్యలు లేకుండా విద్యార్థులు తమ మార్కులను వేగంగా తెలుసుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడుతుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

