Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వావ్! తండ్రికొడుకుల బ్యాంకు ఖాతాల్లో రూ.1518 కోట్లు జమ..ఆశ్చర్యపోయిన సిబ్బంది

వావ్! తండ్రికొడుకుల బ్యాంకు ఖాతాల్లో రూ.1518 కోట్లు జమ..ఆశ్చర్యపోయిన సిబ్బంది

వార్త 3 weeks ago

Huge Money: ఓ వృద్ధుడు తన వృద్దాప్య పింఛన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్లాడు. అతను తన పింఛన్ డబ్బులు తీసుకున్నాడు. ఎందుకైన మంచిది తన ఖాతాలో ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాడు.

వెంటనే ఇంకా ఎన్ని డబ్బులు తన ఖాతాలో ఉందని అడిగాడు. దీంతో సిబ్బంది బ్యాలెన్స్ చెక్ చేశారు. అందులో ఉన్న బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఖాతాలో ఏకంగా రూ.759 కోట్లు ఉన్నాయి. అలాగే ఆ వృద్ధుడి కొడుకు ఖాతాలో రూ.759 కోట్ల జమ అయ్యాయి.

Read Also: SIR : పేరెంట్స్ వివరాలు నింపితేనే కొత్త ఓటు!

 Huge Money

Huge Money: ఆశ్చర్యపోయిన బ్యాంక్ సిబ్బంది

బీహార్ లోని ముజఫర్‌పుర్‌కు చెందిన 82ఏళ్ల కామేశ్వర్ మిశ్రాకు పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆదివారం పింఛన్ డబ్బులు తీసుకుందామని అనుకున్నాడు. అయితే ఆదివారం కావడంతో బ్యాంక్ కు సెలవు ఉంది. దీంతో మిశ్రా దగ్గరలో తెరిచి ఉన్న కామన్ సర్వీస్ సెంటర్(CSC)కి వెళ్లాడు. తనకు పింఛన్ వచ్చిందని డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చినట్లు అతను చెప్పాడు. దీంతో కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు మిశ్రా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి థంబ్ తీసుకుని పింఛన్ డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత మిశ్ర తన ఖాతాలో ఇంకా ఎంత డబ్బు ఉందని అడిగాడు.
అప్పుడు సిబ్బంది బ్యాలెన్స్ చెక్ చేశారు. కామేశ్వర్ మిశ్రా ఖాతాలో ఏకంగా రూ.759 కోట్లు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అలాగే కామేశ్వర్ మిశ్రా కొడుకు ఖాతా కూడా తనిఖీ చేశారు. దివ్యాంగుడైన అతని ఖాతాలో కూడా రూ.759 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరి ఖాతాల్లో కలిపి మొత్తం రూ.1518 కోట్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో కామన్ సర్వీస్ సెంటర్ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా బ్యాంక్ అధికారులు కామేశ్వర్ మిశ్రా, అతని కుమారుడి బ్యాంక్ ఖాతాను స్తంభింప చేశారు.

యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన డెలివరీ బాయ్ అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha