AP Telangana Rain Alert | హైదరాబాద్/అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.
రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.
అల్పపీడన స్థితి - గాలుల తీవ్రత
ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్ సమీపంలో నిన్నటి వరకు ఉన్న అల్పపీడన ప్రాంతం, ఈ రోజు (ఆగస్టు 9, 2026) ఉదయానికి ఈశాన్య మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌పై కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. ఫలితంగా ఏపీ, యానాంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి.
ప్రాంతాల వారీగా
- ఉత్తర కోస్తా & యానాం: ఆది, సోమ, మంగళవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.
- దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఆదివారం నుండి మంగళవారం వరకు అక్కడక్కడ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
- రాయలసీమ: ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా జల్లులు పడే సూచనలు ఉన్నాయి. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు.

AP Telangana Rain Alert: తెలంగాణ వాతావరణ హెచ్చరికలు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
Epaper: epaper.vaartha.com

