Telangana Weather Update: తెలంగాణలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న మండే ఎండలు, తీవ్ర వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరట కలిగించే చల్లని వార్త చెప్పింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
Read Also : Rohini Karte: నేటి నుంచి మొదలైన రోహిణి కార్తె!
Rain forecast in Telangana in next 2 hours!
Telangana Weather Update: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
వాతావరణ శాఖ తాజా అప్‌డేట్ ప్రకారం.. ఉపశమనం కలిగించేలా ప్రధానంగా ఈ క్రింది జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్
ఆ జిల్లాల్లో తేలికపాటి వానలు..
భారీ వర్షాలు కురిసే జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వానలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆ జిల్లాలు ఇవే. కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు
భాగ్యనగర వాసులకు కూడా వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. హైదరాబాద్‌లోని దక్షిణ ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, బాలాపూర్, శంషాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా రాబోయే గంటల్లో వర్షాలు కురిసే బలమైన సూచనలున్నాయని నిపుణులు స్పష్టం చేశారు. ఈ హఠాత్ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, ఎండ తీవ్రత నుండి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

