Sachin Tendulkar: ఐపీఎల్ 2026 సీజన్ అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఈ యువ సంచలనం, తన అటాకింగ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
గత ఐపీఎల్ 2025 సీజన్‌లోనే కేవలం 35 బంతుల్లోనే శతకం బాది అందరి దృష్టిని ఆకర్షించిన సూర్యవంశీకి, ఈ రెండో సీజన్ ఒక రకంగా సవాల్‌తో కూడుకున్నది. ఎందుకంటే సాధారణంగా కొత్త ఆటగాళ్ల బలహీనతలను ప్రత్యర్థులు త్వరగానే పసిగడతారు. కానీ, ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఈ వండర్‌కిడ్ టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.
IPL 2026 Highest Run Scorer
Read also:Praggnanandhaa: నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
లీగ్‌లోనే టాప్ స్కోరర్.. 750 పరుగుల మార్కు దాటిన ఏకైక వీరుడు
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 16 ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ ఏకంగా 776 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మేటి అంతర్జాతీయ స్టార్ బ్యాటర్లు ఈ లీగ్‌లో ఆడినప్పటికీ, ఈ సీజన్‌లో 750 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక క్రికెటర్‌గా సూర్యవంశీ నిలవడం విశేషం. అతని మెరుపు ఇన్నింగ్స్‌లు అభిమానులకు వినోదాన్ని పంచడమే కాకుండా, ప్రత్యర్థి జట్లలో వణుకు పుట్టించాయి. ఈ యువ కెరటం బ్యాటింగ్ శైలిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయ్యారు.
Sachin Tendulkar: రెడ్డిట్ పోస్ట్‌లో సచిన్ టెండూల్కర్ ఆసక్తికర విశ్లేషణ
వైభవ్ సూర్యవంశీ ఆటతీరును విశ్లేషిస్తూ సచిన్ టెండూల్కర్ ఒక రెడ్డిట్ పోస్ట్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. “సూర్యవంశీ కేవలం పరుగులు మాత్రమే చేయలేదు, అంతకుమించి లీగ్‌పై తనదైన ముద్ర వేశాడు. అతను క్రీజులోకి రాకముందే ప్రత్యర్థి జట్లు అతని వికెట్ కోసం ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి వచ్చేది. అటు అభిమానులు సైతం అతని వినోదాత్మక బ్యాటింగ్ చూసేందుకు మైదానాలకు క్యూ కట్టేవారు” అని సచిన్ కొనియాడారు.
ఒత్తిడిని అధిగమించిన ‘గేమ్ ఛేంజర్’
“ఎలిమినేటర్, క్వాలిఫయర్ వంటి అత్యంత కీలకమైన, నాకౌట్ మ్యాచ్‌లలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ, సూర్యవంశీ తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన సహజసిద్ధమైన ఆటను మార్చుకోనని అతను నిరూపించాడు. అన్నింటికంటే ముఖ్యంగా, అతను బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌లో ఒక సరికొత్త నమ్మకం, గెలుపు ధీమా కనిపించేవి” అని సచిన్ వివరించారు. సచిన్ విశ్లేషణను బట్టి చూస్తే.. సూర్యవంశీ కేవలం స్కోరు బోర్డును పరిగెత్తించే ఆటగాడు మాత్రమే కాదని, ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీస్తూ తన జట్టును ముందుండి నడిపించే ఒక అసలైన ‘గేమ్ ఛేంజర్’ అని స్పష్టమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

