Vaibhav Suryavanshi: ఐపీఎల్-2026 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. 15 ఏళ్ల వైభవ్ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి, పాట్ కమ్మిన్స్ వంటి బౌలర్లను సైతం ఎదుర్కొన్నాడు.
అతని బ్యాటింగ్ తీరును చూసి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంది. అతడి కాళ్ల వైపు వచ్చే బంతులను ఫ్రంట్పుట్ క్లియర్ చేసి పక్కకు జరుగుతూ ఆడే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ స్వేచ్చే అతన్ని తనదైన శైలిలో ఆడేలా చేస్తోంది. అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ నిజంగా అత్యుద్భుతం అని సచిన్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
Read also: SRH vs RR:స్టేడియంలోనే ఏడ్చేసిన కావ్య మారన్!
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ ప్రదర్శన
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ సంచలనం, మైదానంలో నిప్పులు చెరిగాడు. పాట్ కమ్మిన్స్ లాంటి దిగ్గజ బౌలర్ల బంతులను సైతం బౌండరీల వెలుపలికి పంపుతూ స్టేడియంను హోరెత్తించాడు. 12 సిక్సర్లతో విరుచుకుపడి, అతి తక్కువ బంతుల్లోనే భారీ స్కోరు సాధించి రికార్డులను తిరగరాశాడు. ప్రత్యర్థి బౌలర్లు వేసిన వ్యూహాలను పటాపంచలు చేస్తూ, బ్యాటింగ్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పాడు.
Vaibhav Suryavanshi: సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు
ఈ ఇన్నింగ్స్ చూసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వైభవ్ ప్రతిభను కొనియాడుతూ ఎక్స్ వేదికగా అభినందించాడు. వైభవ్ బ్యాట్ స్వింగ్ చాలా అద్భుతంగా ఉందని, బంతిని ఎదుర్కొనే విధానం ఎంతో పరిణతితో ఉందని సచిన్ ప్రశంసించాడు. ముఖ్యంగా ఫ్రంట్ ఫుట్ మీదకు వచ్చి బంతులను పక్కకు జరుపుతూ ఆడే శైలి తనకు బాగా నచ్చిందని, ఈ స్వేచ్ఛే అతన్ని గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దుతోందని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఈ కుర్రాడు భారత క్రికెట్ జట్టులో మరిన్ని అద్భుతాలు చేస్తాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
29 బంతుల్లో 97 పరుగులు.. ఎలిమినేటర్‌లో SRHకు నరకం చూపించిన బుడ్డోడు!

