Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టేడియంలోనే ఏడ్చేసిన కావ్య మారన్!

స్టేడియంలోనే ఏడ్చేసిన కావ్య మారన్!

వార్త 2 weeks ago

SRH vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణయానికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచింది.

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సన్‌రైజర్స్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న ఈ యంగ్ గన్ ధాటికి, ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి.

Read Also :IPL 2026 : ఇషాన్ కిషన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న CSK ఫ్యాన్స్

ఆర్చర్ పేస్ వినాశనం - నితీశ్ రెడ్డి పోరాటం వృథా

 SRH Out of IPL 2026

244 పరుగుల హిమాలయ సదృశ్య లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) తన నిప్పులు చెరిగే పేస్ బౌలింగ్‌తో కోలుకోలేని దెబ్బతీశాడు. పవర్‌ప్లేలోనే ఓపెనర్లతో పాటు కీలక వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ తీవ్ర ఒత్తిడిలో పడింది. మిడిల్ ఆర్డర్‌లో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (38) కాసేపు ఒంటరి పోరాటం చేసినా అది ఓటమి భారతాన్ని తగ్గించలేకపోయింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 192 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని అంగీకరించింది.

SRH vs RR: కావ్య మారన్‌పై సోషల్ మీడియాలో సీఎస్‌కే (CSK) ఫ్యాన్స్ ట్రోలింగ్

సన్‌రైజర్స్ టోర్నీ నుండి నిష్క్రమించిన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్‌పై నెటిజన్లు, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు విపరీతంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. లీగ్ దశలో చెన్నైపై సన్‌రైజర్స్ గెలిచినప్పుడు కావ్య మారన్ డగౌట్‌లో ఎగిరి గంతేస్తూ అతిగా సంబరాలు చేసుకున్నారని, "గెలిచినప్పుడు వినయంగా ఉండటం నేర్చుకోవాలి" అంటూ చురకలు అంటిస్తున్నారు. ఆనాటి పాత వీడియో క్లిప్పింగ్స్‌ను, మీమ్స్‌ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా టైటిల్ ఫేవరెట్‌గా నిలిచిన హైదరాబాద్ ఇలా ఎలిమినేటర్‌లోనే సర్దుకోవడం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వండర్ కిడ్ సూర్యవంశీ విధ్వంసం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha