Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ సూర్యవంశీని అభినందించిన కావ్య మారన్.. వైరల్ వీడియో!

వైభవ్ సూర్యవంశీని అభినందించిన కావ్య మారన్.. వైరల్ వీడియో!

వార్త 2 weeks ago

RR vs SRH: ఐపీఎల్ 2026 సీజన్‌లో సరికొత్త రంగులు అలుముకున్నాయి. ముఖ్యంగా ఒక 15 ఏళ్ల టీనేజ్ క్రికెటర్ తన విధ్వంసకర ఆటతీరుతో ప్రపంచ క్రికెట్‌ను మొత్తం ఫిదా చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐపీఎల్ రేసు నుండి వైదొలగేలా చేయడంలో వైభవ్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ఈ మ్యాచ్ మధ్యలో, మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు క్రికెట్ లవర్స్ అస్సలు మర్చిపోలేకపోతున్నారు.

Read Also : Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ట్విట్టర్ వేదికగా సచిన్ ప్రశంసలు!

 Kavya Maran congratulates Vaibhav Suryavanshi.. Viral video!

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 12 గగనతల సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 97 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను అతను చితకబాదుతుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ ముఖం మాడిపోయింది. ఒకవైపు ఈ యంగ్ ప్లేయర్ టాలెంట్ చూసి లోలోపల అభినందించాలనిపించినా.. మరోవైపు తమ జట్టును ఇలా ఉతికి ఆరేస్తున్నాడేంటనే ఆందోళన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.

వైభవ్ సూర్యవంశీ 97 పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు స్టేడియంలోని 38 వేల మంది ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో కావ్య మారన్ కూడా సీట్లో నుంచి లేచి నిలబడ్డారు కానీ చప్పట్లు మాత్రం కొట్టలేదు. అంటే అతని వికెట్ పడటం కోసం ఆమె ఎంత ఆతృతగా ఎదురుచూసిందో క్రికెట్ అభిమానులకు అర్థమైంది. తమ జట్టును ఓటమి అంచుల్లోకి నెట్టిన బ్యాటర్ అవుట్ అవ్వడంతో కావ్య చేసిన ఈ పని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

RR vs SRH: మ్యాచ్ అయిపోయాక పరుగెత్తుకెళ్లి షేక్ హ్యాండ్.. వీడియో వైరల్!

మ్యాచ్ ముగిసిన తర్వాత కావ్య మారన్ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. వైభవ్‌ను చూడగానే ఆమె అతని వైపు పరుగెత్తుకెళ్లారు. ప్రత్యేకంగా కలిసి “అభినందనలు.. మీరు చాలా బాగా ఆడారు” అని ప్రశంసించారు. కావ్య ఇచ్చిన శుభాకాంక్షలను వైభవ్ ఎంతో వినయంగా “ధన్యవాదాలు మేడమ్” అంటూ స్వీకరించాడు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా మారాయి.

ఈ వైరల్ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నువ్వు ఇలా ఆడబట్టే నా జట్టు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది” అంటూ కావ్య మారన్ వైభవ్‌తో అంటున్నట్లు కొందరు సెటైరికల్ మీమ్స్ షేర్ చేస్తుండగా.. వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో ఎలాగైనా సరే ఈ 15 ఏళ్ల రికార్డ్ బ్రేకర్ సంచలనాన్ని కావ్య మారన్ భారీ ధర ఇచ్చి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి కొనుగోలు చేయడం ఖాయమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నేడే భారత్-ఇంగ్లండ్ తొలి టీ20!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha