Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవంగా గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణేష్

వైభవంగా గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణేష్

వార్త 1 week ago

Khairatabad Ganesh Immersion: నగరంలో ఎంతో వేడుకగా సాగిన గణేష్ ఉత్సవాల ముగింపు ఘట్టంలో భాగంగా హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ మహా గణేష్‌ నిమజ్జన ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

శోభాయాత్రగా బయలుదేరిన మహా గణనాథుడిని ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రెయిన్‌ నంబర్‌ 5 వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తుల జయ జయధ్వానాలు, డప్పు వాయిద్యాల మోతల నడుమ వినాయకుడికి భక్తులు వీడ్కోలు పలికారు.

Read Also : Khairtabad Ganesh immersion: క్రేన్ వద్దకు బడా గణేష్

 Khairatabad Maha Ganesh reaches the lap of Goddess Gangamma in a grand procession.

Khairatabad Ganesh Immersion: కిక్కిరిసిన హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలు

ఖైరతాబాద్ మహా గణేష్‌ చివరి దర్శనానికి, నిమజ్జన ఘట్టాన్ని కళ్లారా చేసేందుకు నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలైన ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ రహదారులు భక్తజనసందోహంతో పూర్తిగా కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు, నగర యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.

చార్మినార్ వద్ద హై అలర్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha